Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Graduate Voter Registration | మహబూబ్ నగర్ రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఓటర్ల నమోదు అత్యంత నిస్తేజంగా, నత్తనడకన సాగుతోంది.
Graduate Voter Registration | సిటీబ్యూరో, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): మహబూబ్ నగర్ రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఓటర్ల నమోదు అత్యంత నిస్తేజంగా, నత్తనడకన సాగుతోంది. లక్షలాది మంది పట్టభద్రులు, ఉద్యోగులు ఉన్నప్ప టికీ, ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఆశించిన స్థాయిలో ముందుకు రాకపోవడం గమనార్హం. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ నమోదు ప్రక్రియ కాస్త చురుగ్గా సాగుతున్నట్లు గణాం కాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా గత 2021 ఎన్నికల సమయంలో హైదరాబాద్ నియోజకవర్గ పరిధిలో 5.31 లక్షలు ఓట్లు నమోదయ్యాయి. హైదరాబాద్ నియోజకవర్గంలో దాదాపు రెండు లక్షల మేర దరఖా స్తులు వచ్చాయి. నారాయణ పేటలో అత్యల్పంగా 8034 దరఖాస్తులు, అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 3 491 దరఖాస్తులు స్వీకరించారు. మేడ్చల్ లో 37,364, హైదరాబాద్‌లో 22, 535 దరఖాస్తులను స్వీకరించారు. దీంతో ఈ సారి నాటి ఓటర్ల సంఖ్యతో పోలిస్తే దరఖాస్తులు సగం కూడా రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఐటీ, కార్పొరేట్ రంగానికి కేంద్రంగా ఉన్న హైదరాబాద్ జిల్లా ఈ ఓటరు నమోదు బాగా వెనుకబడిపోయింది.
గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు నవం బర్ 6ను ఆఖరి గడువుగా నిర్ణయించగా, డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. హైదరాబాద్, రంగా రెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో వేలాది సంఖ్యలో ప్రభుత్వ కార్యాల యాలు, ఐటీ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లక్షలాది మంది పట్టభద్రులు ఇక్కడ నివాసముంటూ వివిధ ఉద్యోగాలు చేస్తున్నారు. స్థానిక అడ్రస్ తో ఆధారాలు ఉండి, 2023 అక్టో బర్ 31 నాటికి గుర్తింపు పొందిన యూని వర్సిటీ నుంచి డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఈ ఎమ్మెల్సీ ఓటు నమోదుకు అర్హులే. అయితే, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్, ఐటీ రంగ నిపు ణులు, పీజీ, డీమ్డ్ మిగతా యూనివర్సిటీల పట్టభద్రులు ఉన్నప్పటికీ ఓటరు నమోదుపై తీవ్ర నిరాసక్తత వ్యక్తమవుతోంది. దీనిపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆన్లైన్లో అవకాశమున్నా…
ఎన్నికల సంఘం ఆన్లైన్ లోనూ ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. వెబ్ సైట్ లో పూర్తి మార్గదర్శకాలను ఇచ్చారు. పార్టీలు ప్రత్యేక యాప్ ను రూపొందించి అర్హులైన ఓటర్ల సర్టిఫికెట్లు తీసుకొని వారి వివరాలతో నమోదు కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసు కున్నారు. కార్యకర్తలు, నాయకులు కూడా ఓటర్ల వివరాలతో నమోదుకు ఏర్పాట్లు చేసుకుంటున్నా.. పట్టణాల్లో ఓటర్ల నుంచి ఆ స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదని తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఇవి వర్కవుట్ అవుతున్నాయని చెబుతు న్నారు. అధికారులు, పార్టీలు ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి సారించి గ్రాడ్యుయేట్ ఓట్ల నమోదును వేగ వంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
Hyderabad | హైదరాబాద్‌లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
Bigg Boss 10 | రూల్స్ మార్చేసిన బిగ్‌బాస్.. తనకు అన్యాయం జరిగిందంటూ నరేష్ కన్నీళ్లు!
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

