Revanth Reddy | సీఎం బర్త్‌డే ప్రచార ఖర్చు 150 కోట్లు?.. పత్రికల్లో ప్రకటనలు, సోషల్‌మీడియా, హోర్డింగ్‌ల కోసం భారీగా వెచ్చింపు
Revanth Reddy | సీఎం రేవంత్‌రెడ్డి బర్త్‌డే సందర్భంగా నిర్వహిస్తున్న పలు ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చి స్తున్నారు. ప్రచార ఆర్భాటం కోసం పత్రి కల్లో అడ్వైర్టెజ్మెంట్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఇతరత్రా వాటి కోసం సుమారు రూ.150 కోట్ల మేర ఖర్చు చేస్తున్నట్టు సమాచారం.
Revanth Reddy | హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి బర్త్‌డే సందర్భంగా నిర్వహిస్తున్న పలు ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చి స్తున్నారు. ప్రచార ఆర్భాటం కోసం పత్రి కల్లో అడ్వైర్టెజ్మెంట్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఇతరత్రా వాటి కోసం సుమారు రూ.150 కోట్ల మేర ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రజలందరికీ చెందాల్సిన సొమ్ముతో సొంత ఆర్భాటాలకు ప్రచారం చేసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వంలో రివాజుగా మారుతున్నది. రాష్ట్రంలో ఒక పక్క ఎల్ నినో కారణంగా కరువుతో రైతులు, ప్రజలు అల్లాడిపోతుంటే పట్టించుకోని కాంగ్రెస్ పాలకులు..
సీఎం పుట్టిన రోజును మాత్రం ప్రభుత్వ సొమ్ముతో గ్రాండ్‌గా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. సీఎం పుట్టిన రోజును అధికారికంగా నిర్వహిస్తున్నట్టు ఎక్కడా ప్రకటించనప్పటికీ.. కార్యక్రమాలన్నీ ఆ రోజు చుట్టూ తిరిగేలా డిజైన్ చేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రం సహా ప్రత్యేక రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి ఈ తరహా మాస్టర్‌ప్లాన్ వేసి తన పుట్టినరోజు వేడుకలను చేసుకోలేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం పుట్టిన రోజు నాడు ఆయన నియోజకవర్గం కొడంగల్‌లో ఏకంగా రూ.9,053 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఆ మేరకు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసినట్టు తెల్సింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి సీఎం రేవంత్‌రెడ్డి శనివారం నుంచి 9వ తేదీ వరకు మూడు రోజులపాటు కొడంగల్‌లోనే ఉండనున్నారు.
ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అక్కడే..
ఈ మూడు రోజులు సమస్త ప్రభుత్వ యంత్రాంగం, పలువురు మంత్రులు కొడంగల్‌లోనే ఉండేలా కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. మెగా రైతుమేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పోలను ఏర్పాటు చేశారు. పారిశ్రామికవేత్తలతో సమావేశాలు పెట్టారు. పుట్టినరోజు రేవంత్‌రెడ్డిది అయితే ఖర్చు మొత్తం ప్రభుత్వ ఖాతాలోనే వేసేశారు. ప్రభుత్వం ఖర్చు చేయబోతున్న 9,053 కోట్ల రూపాయల్లో కొడంగల్ నియోజకవర్గ పరిధిలో సీఎం బంధువులు, ఆయన అనుచరుల భూముల కోసం నిర్మిస్తున్న రేడియల్ రోడ్డుకే రూ.5,060 కోట్లను ఖర్చు చేయనున్నారు. ఇక మిగిలినవన్నీ చిన్న చిన్న రోడ్లు, ఆరోగ్య కేంద్రాలు, పోలీసుస్టేషన్ వంటివి ఉన్నాయి. సీఎస్ఆర్ నిధులతో చేపడుతున్న పనులు మరికొన్ని ఉన్నాయి.
కొడంగల్ అంతటా హోర్డింగ్‌లు
కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల ప్రచారానికి భారీగా పత్రికా ప్రకటనలు ఇవ్వబోతున్నారు. రాష్ట్రంలో నిధులు లేవు, ఖర్చులు తగ్గించుకోవాలంటున్న ప్రభుత్వ పెద్దలు 7,8,9వ తేదీల్లో జాతీయ పత్రికలతోపాటు రాష్ట్రంలోని పలు అనుకూల పత్రికలకు, మీడియా సంస్థలకు విచ్చలవిడిగా ప్రకటనలు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెల్సింది. ఈ మేరకు ఇప్పటికే ఐ అండ్ పీ ఆర్ శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. కేవలం పత్రికలు, టీవీల్లోనే కాకుండా డిజిటల్ మాధ్యమాల్లో కూడా ప్రకటనలు చేయనున్నారు. హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు.. ఇలా కొడంగల్ నియోజకవర్గం మొత్తం నింపేయనున్నారు. వీటన్నింటికి కలిపి సుమారు రూ.150 కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశం ఉన్నదని ఓ ఉన్నతాధికారి ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ చెప్పారు. సీఎం పుట్టిన రోజు సందర్భంగానే ప్రభుత్వం కొడంగల్‌లో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నదని, ప్రకటనలు, ప్రచారానికి ఏమాత్రం వెనుకకు వెళ్లవద్దని ఆదేశాలున్నాయని తెలిపారు.
గ్లోబల్ సమ్మిట్‌కు కూడా
కొడంగల్‌లో కూడా గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించిన ప్రకటనల హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక్కడ ఇండస్ట్రియల్ ఎక్స్పో పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇక్కడ కూడా పెట్టుబడుల ఆకర్షణ పేరుతో ప్రచారం చేయనున్నారు. అసలు కొడంగల్‌కు, గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధం ఏమిటన్న ప్రశ్నకు అధికారుల్లో సమాధానం లేదు.
సీఎం సభలకు ఆర్టీసీ బస్సులు
పరిగి: సీఎం రేవంత్‌రెడ్డి మూడురోజుల కొడంగల్ పర్యటన ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు శాపంగా మారనుంది. పండుగ సమయంలో ఆర్టీసీ బస్సులను ప్రయాణికులకు అందుబాటులో లేకుండా సీఎం సభలకు జనాన్ని తరలించేందుకు కేటాయించారు. ముందుగా శనివారం జరుగనున్న రైతు మేళా కోసం వివిధ జిల్లాల నుంచే కాకుండా వికారాబాద్ జిల్లాలోని మూడు డిపోల నుంచి 75 బస్సులను కేటాయించారు. దీపావళి రోజున ఆదివారం కూడా 75 బస్సులను, 9వ తేదీన సోమవారం సీఎం సభ కోసం 126 బస్సులను కేటాయించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సీఎం బర్త్‌డే ప్రచార ఖర్చు 150 కోట్లు?.. పత్రికల్లో ప్రకటనలు, సోషల్‌మీడియా, హోర్డింగ్‌ల కోసం భారీగా వెచ్చింపు
జీవో-31 సుప్రీం తీర్పునకు విరుద్ధం!
Mahesh Kumar Goud| నా మాట ఎవరూ వినట్లే .. నేనేం చేయాలి.. ఏఐసీసీకి మహేశ్‌కుమార్‌గౌడ్ లేఖ
Revanth Reddy | పర్సంటేజీల వేట పాలమూరుపై ఊగిసలాట.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు శాపంగా రేవంత్ సర్కార్
కరువు వేళ చేతులెత్తేసిన సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

