లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌ఫూర్‌లో దారుణం చోటుచేసుకుంది. 12 ఏండ్ల బాలుడు పోర్న్ వీడియోలు చూసి 9 నెలల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. గోరఖ్‌పూర్‌లోని గులేరిహా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ కుటుంబంలోని 9 నెలల చిన్నారి ఈ నెల 19న రాత్రి తల్లి పక్కలో నుంచి కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఊరంతా వెతికారు. చివరకు శనివారం ఉదయం వారి ఇంటికి 500 మీటర్ల దూరంలోని ఓ రేకుల షెడ్డులో అచేతన స్థితిలో చిన్నారి కనిపించింది. ఆమెను దవాఖానకు తరలించగా లైంగిక దాడి జరిగినట్టు డాక్టర్లు గుర్తించారు.
పోలీసులు రంగంలోకి కుటుంబ సభ్యులను విచారించారు. చివరకు వారి ఇంటికి ఛత్తీస్‌గఢ్ నుంచి మూడు రోజుల కింద వచ్చిన 12 ఏండ్ల బాలుడిని (బంధువుల కొడుకు) అదుపులోనికి తీసుకుని విచారించగా మొదట్లో పొంతన లేని సమాధానాలు చెప్పాడు. చివరకు తానే అత్యాచారం చేసినట్టు ఒప్పుకున్నాడు. బాలుడు శుక్రవారం రాత్రి మద్యం సేవించిన తర్వాత.. ఫోన్లో పోర్న్ వీడియోలు చూశాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత చిన్నారిని ఎత్తుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు ఒప్పుకున్నాడు.