ఎస్సెమ్మెస్ లేదా మిస్డ్ కాల్ ఇస్తే సరి.. పీఎఫ్ ఖాతా వివరాలు రెడీ
పీఎఫ్ కోసం ఎస్సెమ్మెస్ లేదా మిస్డ్‌కాల్| మీరు ఎస్సెమ్మెస్ లేదా మిస్డ్ కాల్ ఇచ్చినా మీ పీఎఫ్ ఖాతాలో జమ చేసిన వివరాలు తెలుసుకోవచ్చు..

న్యూఢిల్లీ: ఉద్యోగులకు దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్ ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్). ఇందులో ఉద్యోగి తన జీతంలో 12 శాతం.. యాజమాన్యం మరో 12 శాతం చొప్పున ప్రతి నెలా ఈపీఎఫ్‌లో జమ చేస్తారు. రిటైర్మెంట్ లేదా.. ఉద్యోగం నుంచి వైదొలిగిన తర్వాత ఈపీఎఫ్ నుంచి ఉద్యోగులు పొదుపు చేసిన మొత్తం విత్ డ్రాయల్ చేసుకోవచ్చు.
ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో ఉద్యోగులు తమ పీఎఫ్ నిధి నుంచి నిర్దిష్టమొత్తం ముందస్తుగానే విత్‌డ్రాయల్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఏదేనీ సంస్థలో ఉద్యోగిగా పని చేసే వారు నిరుద్యోగులైతే పాక్షిక మొత్తం విత్ డ్రాయల్ చేసుకునేందుకు నిబంధనలు అనుమతినిస్తున్నాయి.
ప్రత్యేకించి ఈపీఎఫ్‌వో సబ్స్క్రైబర్లు తమ కూతుళ్ల వివాహాలకు, పిల్లల ఉన్నత విద్యాభ్యాసానికి, హోంలోన్ రీ పేమెంట్, అత్యవసర మెడికల్ పరిస్థితుల్లో, హోమ్ రెనోవేషన్, ఇల్లు కొనుగోలు, భూమి కొనుగోలు కోసం పీఎఫ్‌లో కొంత భాగం విత్ డ్రాయల్ చేయవచ్చు.
ఒకవేళ ఈపీఎఫ్‌వోలో సభ్యులుగా ఉన్నవారు తమ పీఎఫ్ ఖాతాలో ఉన్న నగదు మొత్తం తెలుసుకోవాలని కోరుకోవచ్చు. కొన్ని సెకన్లలోనే మీరు పీఎఫ్ ఖాతాలో ఎంత మొత్తం ఉందో తెలుసుకోవచ్చు. మీ మొబైల్ ఫోన్ నుంచి ఎస్సెమ్మెస్ పంపినా, మిస్డ్ కాల్ చేసినా, ఈపీఎఫ్‌వో యాప్, ఉమాంగ్ యాప్ నుంచి గానీ ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో తెలుసుకోవచ్చు.
మిస్డ్ కాల్ లేదా ఎస్సెమ్మెస్ ద్వారా పీఎఫ్ ఖాతాలో జమ అయిన మొత్తం తెలుసుకోవడం ఇలా..
ఎస్సెమ్మెస్ పద్దతి: మీ యూఏఎన్‌ను మీ కైవైసీ వివరాలతో పూరించారనుకోండి.. మీరు ఒక టెక్ట్స్ మెసేజ్ పంపితే మీరు మీ పీఎఫ్ ఖాతాలో జమ వివరాలు తెలుసుకోవచ్చు.. ఈపీఎఫ్‌వో యూఏఎన్ అని ఇంగ్లీష్‌లో టైప్ చేయాలి.
మీకు సులభతరమైన భాషలో అంటే హిందీలో అయితే హెచ్ఐఎన్, మరాఠీలో అయితే ఎంఏఆర్, తమిళంలో అయితే టీఏఎం అని టైప్ చేసి 7738299899 నంబర్‌కు ఎస్సెమ్మెస్ పంపాలి. ఆ వెంటనే మీ పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ వివరాలు మీ ఫోన్‌కు మెసేజీ రూపంలో వస్తాయి.
మిస్డ్ కాల్: మీ యూఏఎన్‌ను మీ కైవైసీ వివరాలతో పూరించారనుకోండి.. అప్పుడు ప్రిస్క్రైబ్డ్ టోల్ ఫ్రీ నంబర్ ఫోన్‌కు మిస్డ్ కాల్ ఇస్తే సరి.. 011-22901406 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి. కాల్ చేసిన తర్వాత ఎస్సెమ్మెస్ రూపంలో మీకు మీ పీఎఫ్ ఖాతా వివరాలు వస్తాయి.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఇవి కూడా చదవండి..
ముంబైలో ఇల్లు కొన్న డీమార్ట్ యజమాని.. ఇంటి ధర ఎంతంటే..?
డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతే ఈ అలారం మోగుతుంది.. సిద్ధం చేసిన మిలటరీ
అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
కరోనా ఎఫెక్ట్ : బీహార్‌లో వారంపాటు విద్యాసంస్థల మూసివేత
కరోనా ఎఫెక్ట్ : జమ్మూకశ్మీర్‌లో పాఠశాలల మూసివేత
పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు మరింత తగ్గుతాయి: ధర్మేంద్ర ప్రధాన్
పక్కా ప్లాన్ ప్రకారమే మెషిన్ గన్లు, దేశీ రాకెట్లతో నక్సల్స్ దాడి..!
విద్యా రుణాలకు ఈ బ్యాంకులు బెస్ట్!
మారుతి సుజుకికి షాక్: డీఆర్ఐ పన్ను ఎగవేత నోటీసులు
రిలయన్స్-ఫ్యూచర్ డీల్‌కు 6 నెలల గడువు
వేదాంత కెయిర్న్‌తో జగడం.. లాభాల రికవరీకి కేంద్రం నోటీసు
హీరో సంచలనం.. ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై మెకానిక్‌లకు శిక్షణ
గూగుల్ ప్లే స్టోర్ యాప్స్ యూసేజీ అంత వీజీకాదు.. ఎందుకంటే!
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- account details
- missed call
- PF
- sms
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

