షాకింగ్: ఆండ్రాయిడ్ యూజర్ల డేటా.. గూగుల్ షేరింగ్!
గూగుల్ షేరింగ్! గూగుల్.. ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల నుంచి డేటాను షేర్ చేస్తున్నదని ఓ అధ్యయనంలో తేలింది.

న్యూఢిల్లీ: సెర్చింజన్ గూగుల్ .. వ్యక్తిగత గోప్యతను పక్కన బెట్టి యూజర్ల డేటా సేకరిస్తుందా? అంటే.. ఓ అధ్యయనం నిజమేనని తేల్చింది. ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల నుంచి గూగుల్ ఎక్కువ డేటాను సేకరిస్తున్నదని ఒక పరిశోధనలో తేలింది. ఈ డేటా సేకరణ ఆపిల్ ఫోన్ల కంటే అధికంగా ఉందని ఆ అధ్యయనం పేర్కొన్నది.
ఐర్లాండ్‌లోని ట్రినిటీ కాలేజీ రీసెర్చర్లు గూగుల్ పిక్సెల్ ఫోన్‌తో షేర్ చేసిన డేటాను, ఆపిల్ ఐఫోన్ డేటాతో పోల్చి చూసుకున్నారు. గూగుల్ ఆపిల్ కంటే 20 రెట్లు ఎక్కువగా హ్యాండ్సెట్ డేటాను సేకరిస్తుందని నిర్ధారించారు.
డబ్లిన్‌లోని ట్రినిటీ కాలేజీకి చెంది డగ్లస్ జె. లీత్ టీం మొబైల్ హ్యాండ్సెట్ గోప్యతపై పరిశోధన జరిపింది. ఏ తయారీదారు ఎక్కువగా యూజర్ డేటాను సేకరిస్తుందో చూడటానికి పిక్సెల్, ఐఫోన్ మోడల్స్ పై పరిశోధన చేపట్టారు.
పిక్సెల్, ఐఫోన్ మోడల్స్ రెండూ సగటున ప్రతి 4.5 నిమిషాలకు ఆయా తయారీదారులతో డేటాను పంచుకుంటున్నాయని పరిశోధకులు కనుగొన్నారు. సేకరించిన డేటాలో ఐఎమ్ఈఐ నంబర్, హార్డ్‌వేర్ సీరియల్ నంబర్, సిమ్ సీరియల్ నంబర్ ,ఐఎంఎస్ఐ, హ్యాండ్సెట్ ఫోన్ నంబర్ మరిన్ని, టెలిమెట్రీ డేటా కూడా ఉన్నాయి.
ఈ స్మార్ట్ఫోన్లలో యూజర్ సిమ్‌ను వేసినప్పుడు, గూగుల్, ఆపిల్ కంపెనీలకు రెండింటికి సదరు యూజర్ల పూర్తి వివరాలు వెళ్తాయి. అంతేకాక ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ మ్యాక్ అడ్రస్‌లను, జీపీఎస్ లోకేషన్‌ను ఆపిల్‌కు పంపుతుందని తెలిసింది.
ఆపిల్ లాగిన్ కానప్పుడు కూడా యూజర్ లోకేషన్‌ను, అలాగే స్థానిక ఐపీ అడ్రస్‌ను సేకరిస్తున్నట్టు పరిశోధకులు పేర్కొన్నారు.ఈ రెండు ఆపరేటింగ్ సిస్టమ్‌ల నుంచి యూజర్లు వైదొలిగినా కూడా టెలిమెట్రీ డేటాను పంపుతాయని తేలింది.
ఫోన్ ఆన్ చేసిన 10 నిమిషాల్లోనే గూగుల్ 1 ఏంబీ డేటాను సేకరిస్తే.. ఆపిల్ 42కేబీ డేటాను సేకరిస్తుందని తెలిపారు. అయితే ఈ పరిశోధనను గూగల్ కొట్టివేసింది. పరిశోధన చేయడానికి సరైన ప్రమాణాలను పాటించలేదని ఆ సంస్థ ప్రతినిధి వాదించారు.
ఇవి కూడా చదవండి..
బ్లడ్ క్యాన్సర్.. లక్షణాలు ఎలా ఉంటాయి.. చికిత్స ఏంటి..?
దీదీ.. మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారా?
ఒప్పో F19 రిలీజ్ డేట్ ఫిక్స్
అల్లం టీతో ఆస్తమాకు గుడ్‌బై.. ఇంకా మరెన్నో ప్రయోజనాలు
బ్లడ్ క్యాన్సర్.. లక్షణాలు ఎలా ఉంటాయి.. చికిత్స ఏంటి..?
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సేంద్రియ వ్యవసాయం
ఏప్రిల్‌లో భారత్‌లో విడుదలయ్యే టాప్ స్మార్ట్ఫోన్లు ఇవే!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

