చౌకగా రియాల్ట్రిస్–ఏజెడ్‌ను విడుదల చేసిన గ్లెన్‌మార్క్

హైదరాబాద్, మే 3:ఇంటర్నేషనల్ రీసెర్చ్ బేస్డ్ ఫార్మాసంస్థ గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఇప్పుడు భారతదేశంలో మోస్తరు నుంచి తీవ్రమైన అలెర్జిక్ రినిటీస్ లక్షణాల చికిత్స కోసం రియాల్ట్రిస్–ఏజెడ్‌ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఊపిరితిత్తుల విభాగంలో అగ్రగామిలలో ఒకటిగా ఉన్న గ్లెన్‌మార్క్, బ్రాండెడ్ జెనిరిక్ వెర్షన్‌ను అత్యంత సరసమైన ధరలో భారతదేశంలో అలెర్జిక్ రినిటీస్ చికిత్స కోసం విడుదల చేసిన మొట్టమొదటి కంపెనీగా నిలిచింది. ఇది రోగులకు పూర్తి సౌకర్యాన్ని అందించడంతో పాటు, దేశంలో అత్యంత చవకైన చికిత్సను సైతం అందిస్తుంది.
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మోమెటసోన్ ఫ్యురేట్ 50ఎంసీజీ+అజెలస్టిన్ 140ఎంసీజీని ల స్థిర మోతాదు సమ్మేళనంగా రియాల్ట్రిస్–ఏజెడ్‌ను విడుదల చేసిన మొట్టమొదటి కంపెనీ గ్లెన్‌మార్క్.
ఓ అధ్యయనం ప్రకారం భారతదేశంలో 20–30% మంది అలెర్జిక్ రినిటీస్తో బాధపడుతున్నారు. అంతేకాదు, రోగులు తమ ఔషధ ఖర్చును సైతం తామే భరించాల్సి ఉంటుంది. చికిత్సావకాశాలపై పెను ప్రభావం చూపే అంశమిది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 10 బ్రాండ్లు ఇదే తరహా లక్షణాలు కలిగిన వ్యాధి చికిత్సకు విడుదల చేసిన ఔషదాల సరాసరి వెల 365 రూపాయలుగా ఉంటేరియాల్ట్రిస్–ఏజెడ్ నాజల్ స్ర్పేను కేవలం 175 రూపాయలకే 75మీటర్డ్ డోసెస్ (ఎండీ) ప్యాక్‌ను అందిస్తున్నది.
అలోక్ మాలిక్, గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ అండ్ బిజినెస్ హెడ్, ఇండియా ఫార్ములేషన్స్ మాట్లాడుతూ ‘‘ భారతదేశ వ్యాప్తంగా శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులకు తాజా చికిత్సావకాశాలను అందిస్తోన్న సంస్థ గ్లెన్‌మార్క్. మా బ్రాండ్ రియాల్ట్రిస్–ఏజెడ్‌ను పరిచయం చేయడం పట్ల సంతోషంగా ఉన్నాము. దీనిని క్లీనికల్‌గా అధ్యయనం చేయడంతో పాటుగా విప్లవాత్మకంగా అత్యంత అందుబాటు ధరలో దేశవ్యాప్తంగా రోగులకు అందిస్తున్నాం.’’ అని అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Glenmark
- Launches
- Realtris-AZ
RELATED ARTICLES
తాజా వార్తలు
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
పాలనా వికేంద్రీకరణతో పారిశ్రామిక విప్లవం
వందేండ్ల అభివృద్ధి.. పదేండ్లలోనే.. విశ్వనగరంలో ప్రగతి పతాక రెపరెపలు
బీజేపీ కోసమే ఓట్ల తొలగింపు.. 95 లక్షల ఓట్ల గల్లంతుపై స్వతంత్ర విచారణ చేపట్టాలి : బీఆర్ఎస్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

