పారిశుధ్య సిబ్బంది బాగోగులే లక్ష్యంగా..

- బల్దియా ప్రత్యేక దృష్టి 200ల మందికి క్యాన్సర్ పరీక్షలు
- ఉచిత వైద్యశిబిరాల నిర్వహణ, మందులు అందజేత
- ప్రస్తుతం కరోనా పరీక్షలు,
- టీకా ఇస్తున్న అధికారులు కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏఎంఓహెచ్ బిందు భార్గవి సూచన
జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బంది బాగోగులపై బల్దియా అధికారులు దృష్టిసారించారు. కొవిడ్-19 నేపథ్యంలో సిబ్బందికి ఒకపక్క కరోనా పరీక్షలు, మరోపక్క వ్యాక్సిన్లు ఇచ్చే ప్రక్రియను చేపడుతూనే వారికి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వారికి మందులు, నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారు.
యూసుఫ్‌గూడ సర్కిల్-19లో రెండు రోజుల కిందట కిమ్స్ దవాఖాన ఆధ్వర్యంలో పారిశుధ్య సిబ్బందికి క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనుబంధంగా సోమవారం యూసుఫ్‌గూడ సర్కిల్ పరిధిలోని వైద్య సిబ్బందికి ఏఎంఓహెచ్ బిందు భార్గవి ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. కరోనా నేపథ్యంలో పారిశుధ్య సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు, సర్కిల్లో మహిళా సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కిమ్స్ దవాఖాన సౌజన్యంతో 200 పారిశుధ్య సిబ్బందికి బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించినట్లు, ఈ సందర్భంగా నిర్వహించిన స్క్రీనింగ్‌లో ఒక మహిళను అనుమానాస్పదంగా గుర్తించి మెరుగైన చికిత్సనందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పారిశుధ్య సిబ్బందికి కొవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతున్నదని, కరోనా నేపథ్యంలో సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. కొన్నిచోట్ల కుటుంబ సభ్యులకు లక్షణాలున్న కారణంగా పారిశుధ్య సిబ్బందిని హోమ్ క్వారంటైన్లో ఉంచినట్లు, ప్రయాణాలు చేసి వచ్చిన వారిని సైతం పరీక్షలు చేయించుకున్న అనంతరం విధుల్లోకి అనుమతిస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- GHMC
- health checkup
- workers
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Protests | సర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో మళ్లీ మొదలైన ఆందోళనలు.. పలువురు అరెస్ట్
Tharun Bhascker | ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా తరుణ్ భాస్కర్ క్రేజీ ఎంటర్టైనర్!
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

