ఈవీలపై మెర్సిడెస్ బెంజ్ ఫోకస్
జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ క్రమంగా తన పంతాను మార్చుకుంటున్నది. లగ్జరీ కార్లతోపాటు విద్యుత్‌తో నడిచే వాహనాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే కొన్ని వాహనాలను విడుదల చేసినప్పటికీ ఇక నుంచి విడుదలయ్యేవాటిలో వీటికి అధిక ప్రాధాన్యతనివ్వనున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు.
- కంపెనీ ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్
హైదరాబాద్, నవంబర్ 17 : జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ క్రమంగా తన పంతాను మార్చుకుంటున్నది. లగ్జరీ కార్లతోపాటు విద్యుత్‌తో నడిచే వాహనాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే కొన్ని వాహనాలను విడుదల చేసినప్పటికీ ఇక నుంచి విడుదలయ్యేవాటిలో వీటికి అధిక ప్రాధాన్యతనివ్వనున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. హైదరాబాద్‌తోపాటు తెలంగాణ, ఏపీలలో ఈవీ కార్లకు ఆదరణ క్రమంగా పెరుగుతున్నదని, ఇది వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి దోహదం చేయనున్నదన్నారు. కంపెనీ మొత్తం విక్రయాల్లో ఈవీల వినిమయం చాలా తక్కువగా ఉన్నదని, ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నదన్నారు. వచ్చే ఏడాది అంతర్జాతీయ మార్కెట్లోకి 40 కొత్త మాడళ్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించిన ఆయన..వీటిలో కొన్ని దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించారు.
మరోవైపు, ద్వితీయ శ్రేణి నగరాలతోపాటు తృతీయ శ్రేణి నగరాలపై సంస్థ ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు. ఇటీవలకాలంలో మెట్రో నగరాలతోపాటు చిన్న స్థాయి నగరాల్లోనూ లగ్జరీ కార్ల అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయన్నారు.
- పూణెకు సమీపంలో రూ.3 వేల కోట్ల పెట్టుబడితో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ యూనిట్ సామర్థ్యం ఏడాదికి 20 వేల యూనిట్లు.
- ప్రస్తుతం భారత్‌లో సంస్థ 25 మాడళ్లను విక్రయిస్తుండగా, వీటిలో 11 దేశీయంగా తయారవుతుండగా, మిగతా మాడళ్లను దిగుమతి చేసుకుంటున్నది.
- ఈ ఏడాది కొత్తగా 16 టచ్పాయింట్లను ప్రారంభించింది. దీంతో టచ్పాయింట్ల సంఖ్య 140కి పైకి చేరుకున్నాయి.
- కంపెనీ మొత్తం వాహన విక్రయాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా 15 శాతంగా ఉన్నది. అలాగే 10 విక్రయ కేంద్రాలు ఉన్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

