Gadar 2 Movie Trailer| సరిగ్గా ఇరవై రెండేళ్ల క్రితం బాలీవుడ్ లో గదర్ సినిమా సృష్టించిన రికార్డుల అంతా ఇంతా కాదు. అప్పట్లో ఈ సినిమా పెను సంచలనమే సృష్టించింది. ఈ ఒక్క సినిమాతో సన్నీ డియోల్ పేరు మార్మోగిపోయింది. ఒక రోమ్ కామ్ సినిమా అప్పట్లోనే ఆ రేంజ్ కలెక్షన్లు సాధించిందంటే మాములు విషయం కాదు. ఇక అమీషా, సన్నీ డియోల్ కెమిస్ట్రీ కొన్నేళ్ల పాటు ప్రేక్షకులకు గుర్తిండిపోయింది.
తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కింది. ఆగస్టు 11న విడుదల కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో తారా స్థాయిలో అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్, టీజర్ సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. అయితే విడుదలైన 24 గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్‌తో ఈ ట్రైలర్ దూసుకెళుతుంది.
తొలిపార్టుకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా 1971లో జరిగిన ఇండో-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో జరుగుతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. తండ్రీ కొడుకుల బంధం, యాక్షన్, దేశభక్తి, అన్ని కలగలిపి ఉన్న ఈ చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 11న విడుదల చేయనున్నారు. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఉత్కర్ష్ శర్మ, అమీషా, సన్నీ డియోల్ ప్రధాన పాత్రలు పోషించారు. జీ స్టూడీయోస్ తో కలిసి అనీల్ శర్మ స్వయ నిర్మాణంలో ఈ సినిమాను తెరకెక్కించాడు.