Daler Mehndi | దలేర్ మెహందీ వివాదంపై పీఎం మోదీకి FWICE లేఖ.. కళాకారుల పట్ల సంయమనం పాటించాలని విజ్ఞప్తి!
FWICE | ప్రముఖ గాయకుడు దలేర్ మెహందీని ఉత్తరాఖండ్ మంత్రి పబ్లిక్‌గా అవమానించిన ఘటనపై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
FWICE | ప్రముఖ గాయకుడు దలేర్ మెహందీని ఉత్తరాఖండ్ మంత్రి పబ్లిక్‌గా అవమానించిన ఘటనపై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీకి, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి ఆ సినీ సంఘం లేఖ రాసింది. ప్రజా ప్రతినిధులు కళాకారుల పట్ల మరింత సున్నితంగా, గౌరవప్రదంగా వ్యవహరించాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేసింది.
ఉత్తరాఖండ్‌లోని న్యూ టెహ్రీలో నవరాత్రి వేడుకల సందర్భంగా నిర్వహించిన ఒక ఈవెంట్లో దలేర్ మెహందీ లైవ్ కచేరీ నిర్వహించారు. ఈ వేదికపైకి ఉత్తరాఖండ్ కేబినెట్ మంత్రి సుబోధ్ ఉనియాల్ అకస్మాత్తుగా వచ్చి దలేర్ మెహందీపై తీవ్ర ఆరోపణలు చేశారు. దలేర్ మద్యం సేవించి స్టేజ్‌పై ప్రదర్శన ఇస్తున్నారని, మాట్లాడటానికే రాని ఆయన సరిగ్గా ఎలా పాడగలరని మంత్రి బహిరంగంగా ప్రశ్నించారు. ఈ ఘటన తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది.
అయితే, దలేర్ మెహందీ మద్యం తాగాడన్న ఆరోపణలను ఆయన సోదరుడు, ప్రముఖ గాయకుడు మీకా సింగ్ తీవ్రంగా ఖండించారు. దలేర్ ఇటీవల మేజర్ సర్జరీ నుంచి కోలుకుంటున్నారని, అనారోగ్యంతో ఉన్నప్పటికీ అభిమానుల కోసం స్టేజ్‌పై ప్రదర్శన ఇచ్చారని స్పష్టం చేశారు. ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడే విద్యార్థిని మందలిస్తే పెద్ద సమస్య అవుతుందని, అలాంటిది అంతటి సీనియర్ కళాకారుడిని ఇలా అవమానించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. మంత్రి సుబోధ్ ఉనియాల్ తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని, అలాగే ఈ ఈవెంట్ కోసం రూ. 35 లక్షలు చెల్లించామన్న నిధులకు సంబంధించిన రికీట్లను లేదా చెల్లింపు వివరాలను బహిర్గతం చేయాలని మీకా డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన FWICE.. కళాకారులు దేశ సాంస్కృతిక వైభవానికి అందించిన సేవలను గుర్తుచేసింది. పబ్లిక్ ఈవెంట్లలో ఎలాంటి సమస్యలొచ్చినా వాటిని బాధ్యతాయుతంగా, సున్నితంగా పరిష్కరించుకోవాలి తప్ప, పది మందిలో ఇలా బహిరంగంగా అవమానించడం సరికాదని పేర్కొంది. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా ఉన్న వినోద రంగ నిపుణులను, కళాకారులను తీవ్రంగా కలచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు, అధికారులకు తగిన సూచనలు చేసి, భవిష్యత్తులో కళాకారుల పట్ల మరింత గౌరవంగా, సంయతనంతో వ్యవహరించేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని, సీఎంను ఆ సినీ సంఘం కోరింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Daler Mehndi | దలేర్ మెహందీ వివాదంపై పీఎం మోదీకి FWICE లేఖ.. కళాకారుల పట్ల సంయమనం పాటించాలని విజ్ఞప్తి!
Sheetal Devi: ఆర్చరీలో శీతల్ దేవి అద్భుతం.. పారా గేమ్స్‌లో రెండో స్వర్ణం
Vishwak Sen | ఎన్టీఆర్‌తో సినిమానా… కథ తీసుకెళ్తే కొడతాడంటూ విశ్వక్ సేన్ కామెంట్స్
Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

