Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Para Swimmer Aalam Shaikh: భారతీయ పారా స్విమ్మర్ మొహమ్మద్ షామ్స్ ఆలమ్ షేక్‌ను.. జపాన్ నుంచి డిపోర్ట్ చేశారు. హోటల్ రూంలో క్లీనింగ్ స్టాఫ్ లేడీతో అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో అతన్ని జపాన్ పోలీసులు డిపోర్ట్ చేశారు.
నగోయా: భారతీయ పారా స్విమ్మర్ మొహమ్మద్ షామ్స్ ఆలమ్ షేక్(Para Swimmer Aalam Shaikh)ను .. జపాన్ నుంచి డిపోర్ట్ చేశారు. మెన్స్ 100మీ బటర్‌ఫ్లై, 50మీ బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్లలో గతంలో షేక్ మాజీ వరల్డ్ నెంబర్‌వన్‌గా నిలిచాడు. గురువారం జపాన్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. షెర్టన్ హోటల్లో హౌజ్కీపింగ్కు చెందిన నేపాలీ మహిళను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. హోటల్ రూమ్‌లో అనుచితంగా ప్రవర్తించినట్లు ఆమె ఫిర్యాదు చేసింది. రూమ్ నుంచి తప్పించుకున్న ఆమె.. మేనేజర్‌కు ఫిర్యాదు చేసింది.
భారతీయ బృందానికి చెందిన వ్యక్తిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం ఇది రెండో ఘటన. కొన్ని రోజుల క్రితం ఇండియా హాకీ ఫెడరేషన్‌కు చెందిన ఓ అఫీషియల్ను కూడా చెడు ప్రవర్తన కింద ఇంటికి పంపించేశారు. అయితే సమస్య పరిష్కారం కోసం హోటల్ మేనేజ్మెంట్కు భారత బృందం క్షమాపణలు చెప్పింది. ఇక ఆ అథ్లెట్‌పై జీవితకాల నిషేధం విధించేందుకు ఏషియన్ పారా గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ ఆలోచిస్తున్నది. స్విమ్మర్ షేక్ ఇండియాకు రాగానే అతనిపై చర్యలు తీసుకుంటామని పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

