Sheetal Devi: ఆర్చరీలో శీతల్ దేవి అద్భుతం.. పారా గేమ్స్‌లో రెండో స్వర్ణం
Sheetal Devi: పారా ఆర్చరీలో శీతల్ దేవి సంచలనాలు సృష్టిస్తున్నది. జపాన్‌లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్‌లో ఆమె రెండో స్వర్ణం గెలిచింది. మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్లోనూ గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నది. దీంతో ఈ గేమ్స్‌లో మొత్తం మూడు పతకాలు ఆమె ఖాతాలో పడ్డాయి.
నగోయా: శీతల్ దేవికి చేతులు లేవు. కానీ ఆమె ఆర్చరీలో దిట్ట. ఇండియన్ ఆర్చర్ శీతల్ దేవి(Sheetal Devi).. ఏషియన్ పారా గేమ్స్‌లో రెండో స్వర్ణం గెలిచింది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ఈవెంట్లోనూ ఆమె గోల్డ్ మెడల్ గెలుచుకున్నది. ఉత్కంఠంగా సాగిన ఫైనల్లో ఆమె సింగపూర్ అథ్లెట్ ఆలిమ్ నుర్ స్యాహిదాను ఓడించింది. తోమన్ కుమార్‌తో కలిసి కాంపౌండ్ మిక్స్ టీమ్ గోల్డ్ మెడల్ గెలిచిన కొన్ని గంటల వ్యవధిలోనూ వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్లో శీతల్ దేవి అద్భుత ప్రదర్శన ఇచ్చి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నది. 19 ఏళ్ల వరల్డ్ చాంపియన్ శీతల్ దేవి 142-139 స్కోరుతో ఆలిమ్పై విజయం సాధించింది. 2023 హాంగ్జూ గేమ్స్‌లోనూ ఆమె ఆలిమ్పైనే విక్టరీ కొట్టింది. ప్రస్తుత పారా గేమ్స్‌లో శీతల్ దేవి ఖాతాలో మొత్తం మూడు పతకాలు ఉన్నాయి. మహిళల డబుల్స్ సిల్వర్ కూడా గెలిచిందామె.
Sheetal Devi – the most successful Indian Athlete at the #AsianParaGames #AichiNagoya2026 with 2 Gold medals & 1 silver medal in Compound Archery.
Simply incredible. Takes away all our right to complain about anything in life
Very proud to support her for the last 4 yrs #OGQ https://t.co/9tk0ysLzO7
— Viren Rasquinha (@virenrasquinha) October 22, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheetal Devi: ఆర్చరీలో శీతల్ దేవి అద్భుతం.. పారా గేమ్స్‌లో రెండో స్వర్ణం
Vishwak Sen | ఎన్టీఆర్‌తో సినిమానా… కథ తీసుకెళ్తే కొడతాడంటూ విశ్వక్ సేన్ కామెంట్స్
Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

