నెరవేరుతున్న యువత పోలీస్ కల
- భారీ సంఖ్యలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు
- ఇప్పటికే 28,277 పోలీస్ కొలువుల భర్తీ
- తాజాగా మరో 18,334 పోస్టులకు అనుమతి
హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): పోలీస్ యూనిఫాం వేసుకొని ప్రజలకు సేవ చేయాలనే యువత కలను తెలంగాణ సర్కారు నెరవేరుస్తున్నది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దసంఖ్యలో పోలీస్ కొలువులను భర్తీ చేసింది. తాజాగా మరో 18,334 పోలీస్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడంతో యువతలో ఆనందం వ్యక్తమవుతున్నది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సై, కానిస్టేబుళ్లు కలిపి వివిధ విభాగాల్లో 28,277 పోస్టులను భర్తీ చేసింది. సబ్ ఇన్స్పెక్టర్లు 1,810 మంది, కానిస్టేబుళ్లుగా 26,467 మంది నియమితులయ్యారు. వీరంతా రాష్ట్రవ్యాప్తంగా విధులు నిర్వర్తిస్తున్నారు.
భర్తీ ప్రక్రియలో వేగంగా
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కొలువుల భర్తీ ప్రక్రియ వేగంగా సాగడం నిరుద్యోగుల్లో భరోసా నింపుతున్నది. తాజాగా ముగిసిన నియామక ప్రక్రియలోనూ మొత్తం 16 వేల మందికి కొవిడ్-19 పరిస్థితుల్లోనూ 12 నెలల శిక్షణను విజయవంతంగా పూర్తిచేశారు. ఒక దశలో నేషనల్ పోలీస్ అకాడమీలో సైతం పోలీస్ శిక్షణ ఆగినా.. మన తెలంగాణ పోలీస్ అకాడమీ.. ఇతర శిక్షణ కేంద్రాల్లో మాత్రం ఆగలేదు. పూర్తిస్థాయి జాగ్రత్తలు పాటిస్తూ 16 వేల మందిని సుశిక్షితులైన పోలీసులుగా తీర్చిదిద్దారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Police uniform
- TRS Party
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

