బార్జ్ మునక : నాలుగో రోజు కొనసాగుతున్న అన్వేషణ
తౌటే తుఫాన్ కారణంగా సముద్రంలో మునిగిపోయిన బార్జ్‌లో నాలుగో రోజు అన్వేషణ కొనసాగుతున్నది.

ముంబై : తౌటే తుఫాన్ కారణంగా సముద్రంలో మునిగిపోయిన బార్జ్‌లో నాలుగో రోజు అన్వేషణ కొనసాగుతున్నది. ఇప్పటివరకు 5 ఐఎన్ఎస్ నౌకలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొని దాదాపు 37 మృతదేహాలను వెలికితీశారు. గురువారం ఆలస్యంగా 11 మృతదేహాలను ముంబై తీరానికి తీసుకొచ్చారు.
బార్జ్ పీ-305 లో నేవీ ఆపరేషన్ నాల్గవ రోజు కొనసాగుతున్నది. సహాయక చర్యలు గత 55 గంటలుగా నిరవధికంగా కొనసాగుతున్నాయి. ఐఎన్ఎస్ కొచ్చి ఇప్పటికీ సముద్రంలో సహాయక చర్యల్లోనే ఉన్నది. మరో 38 మంది నావికుల జాడ ఇప్పటికీ తెలియడం లేదు. ఓఎన్జిసీ తెలిపిన వివరాల ప్రకారం, బార్జ్ పీ-305 లో 263 మంది సిబ్బంది ఉన్నారు. తొలుత 273 మంది ఉన్నట్లు తెలిపారు. సముద్రంలో చిక్కుకున్న మిగతా మూడు ఓడలు, వాటిలోని సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారు.
తప్పిపోయిన నావికుల కోసం నావికా దళ విమానం, హెలికాప్టర్లు 60 గంటలకు పైగా వెతుకుతున్నాయి. ఇప్పుడు నిఘా విమానం పీ -81 ను రంగంలోకి దింపేందుకు నేవీ యోచిస్తున్నది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన మూడు పీ -81 విమానాలు తమిళనాడు వైమానిక స్థావరం నుంచి ముంబై చేరుకుని సముద్రంలో గాలిస్తున్నాయి.
రెస్క్యూ పనిలో 5 ఐఎన్ఎస్ ఓడలు
ముంబై తీరప్రాంతానికి 88 కిలోమీటర్ల దూరంలో ఉన్న డైమండ్ ఆయిల్ ఫీల్డ్స్ ప్రాంతంలో బార్జ్ మునిగిపోయింది. అందువల్ల, నావికాదళం 80 నుంచి 100 కిలోమీటర్ల విస్తీర్ణంపై నిఘా పెడుతున్నది. ఆకాశం నుంచి అన్వేషణ కొనసాగించడానికి 6 హెలికాప్టర్లు, 3 విమానాల సహాయం తీసుకుంటున్నారు. ఐఎన్ఎస్ కొచ్చి, కోల్‌కతాలతో పాటు ఐఎన్ఎస్ టెగ్, ఐఎన్ఎస్ బెట్వా, ఐఎన్ఎస్ బియాస్ కూడా తప్పిపోయిన వ్యక్తుల కోసం శోధిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
కాలికట్ చేరిన వాస్కోడిగామా.. చరిత్రలో ఈరోజు
అహ్మదాబాద్‌లో కుప్పకూలిన ఐదంతస్థుల భవనం.. వీడియో
సముద్ర పర్యవేక్షణకు ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా
మార్స్‌పై ‘మర్మ రాయి’ని కనుగొన్న నాసా రోవర్
మరో చిప్కో ఉద్యమం.. ఎంపీలో ‘సేవ్ బక్స్వాహా ఫారెస్ట్’
బ్రిటన్ అన్‌లాక్ : కలకలలాడుతున్న ఎయిర్‌పోర్ట్స్, రెస్టారెంట్స్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

