హైదరాబాద్, ఆట ప్రతినిధి: టైటెండ్ గ్లోబల్ స్పోర్ట్స్, స్కైకింగ్స్ ఫుట్బాల్ అకాడమీ సంయుక్తంగా ప్రతిభాన్వేషణ కోసం శ్రీకారం చుట్టాయి. తెలంగాణ ఫుట్బాల్ సంఘం(టీఎఫ్ఏ) భాగస్వామ్యంతో ఈ నెల 19, 20 తేదీల్లో అండర్-21 టోర్నీ నిర్వహిస్తున్నారు. బోయిన్పల్లిలోని స్కైకింగ్స్ అకాడమీ వేదికగా జరుగనున్న టోర్నీలో మొత్తం 10 జట్లు పోటీపడుతున్నాయి. 11ఏ సైడ్ ఫార్మాట్లో నిర్వహించే ఈ టోర్నీ లీగ్ దశలో పది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి తలపడనున్నాయి. మరిన్ని వివరాల కోసం ఆసక్తి ఉన్న ప్లేయర్లు 9704299881 నంబర్లో సంప్రదించవచ్చు.