జూరాలకు వరదహోరు

- లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో
- 11 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల
- కొనసాగుతున్న విద్యుతుత్పత్తి
- లక్ష 17 వేల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో
ఆత్మకూరు: ఉమ్మడి జిల్లా వరప్రదాయిని జూరాల రిజర్వాయర్‌కు వరద హోరెత్తుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఉవ్వెత్తున ప్రవహిస్తూ జూరాలకు చేరుకుం టుంది. బుధవారం రాత్రి వరకు 20 గేట్లు తెరుచుకోగా గురువారం ఉదయానికి 5 గేట్లు కుదించి 15 గేట్లను మాత్రమే ఉంచారు. సాయంత్రానికి వరద లక్షా 7 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా 11 గేట్లను మాత్రమే ఎత్తి స్పిల్‌వే ద్వార 76,648 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
కుడి కాలువకు 672 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 920, సమాంతర కాలువకు 150, నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750, భీమా-2కు 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తికి 38,349 క్యూసెక్కుల నీటిని విడు దల చేస్తుండగా రెండు విద్యుత్ కేంద్రాలలో విద్యుతుత్పత్తిని నిర్వహిస్తున్నారు.
ఎగువ జూరాల జలవిద్యుత్ కేంద్రంలో మరమ్మతుకు గురైన 5 యూనిట్ వినియోగంలోకి రాగా ఎగువ జూరాలలో 6 యూ నిట్ల ద్వారా 3.549 మి.యూ ఉత్పత్తి జరుగగా ఇప్పటి వరకు మొత్తంగా 224.161 మి.యూ ఉత్పత్తి జరిగింది. దిగు వ జూరాలలో 6 యూనిట్ల ద్వారా 4.283 మి.యూ ఉత్పత్తి జరుగగా మొత్తంగా 549.840 మి.యూ విద్యుత్ ఉత్పత్తి జరిగింది. ప్రాజక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా సాయంత్రానికి 8.571 టీఎంసీలు నమోదయ్యింది. ప్రాజక్టు నుంచి 1,17, 557 లక్షల క్యూసెక్కులు అవుట్‌ఫ్లో కొనసాగుతుంది
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

