Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
Ganja Seized | కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్ వద్ద రెబ్బెన పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో 5.232 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని, భార్యభర్తను అరెస్ట్ చేశారు.
ఆసిఫాబాద్ : కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్ వద్ద రెబ్బెన పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో 5.232 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం ( Ganja Seize ) చేసుకుని, భార్యభర్తను అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.2.7లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ నితికా పంత్ ( SP Nitika Pant ) వెల్లడించారు. సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆమె వెల్లడించారు.
ఈస్గాంకు చెందిన జుమూర్ గెయిన్, ఆమె భర్త సురంజన్ గెయిన్ కాగజ్‌నగర్‌లో నివాసముం టున్నారని తెలిపారు. భర్త సురందజన్ ఈనెల 14న ఒడిస్సాకు వెళ్లి పింటూ అనే వ్యక్తి వద్ద రూ.15 వేలకు 5.232 కిలోల గంజాయిని కొనుగోలు చేసి తీసుకువచ్చాడని వివరించారు. ఇద్దరు మంచిర్యాల వైపు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా రెబ్బెన పోలీసులు కాగజ్‌నగర్ వద్ద తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారని తెలిపారు.వీరి వద్ద నుంచి సుమారు రూ.2.70 లక్షల విలువైన గంజాయిని, బైక్‌ను , సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వెల్లడించారు.
పింటూ (ఒడిశా), మున్నీ (మంచిర్యాల), చంద్రశేఖర్ (జైపూర్), రాజు (జైపూర్) తదితరుల పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. గంజాయి ఎక్కడి నుంచి సేకరించారు. ఎవరెవరికి సరఫరా చేయాల్సి ఉంది. అక్రమ రవాణా వెనుక ఉన్న ఇతర వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనే అంశాలపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారని చెప్పారు. కేసులో ఆసిఫాబాద్ డీఎస్పీ బి. అశోక్, వాంకిడి సీఐ వేణుగోపాల్, రెబ్బెన ఎస్సై వెంకటకృష్ణ , పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ నితికా పంత్ అభినందించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
KCR | తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
No Relief For CJP | అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు.. కస్టడీని పొడిగించిన కోర్టు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

