No Relief For CJP | అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు.. కస్టడీని పొడిగించిన కోర్టు
No Relief For CJP | కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నాయకులైన అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు ఊరట లభించలేదు. వీరిద్దరి జ్యుడీషియల్ కస్టడీని మరో రెండు రోజులు పాటు కోర్టు పొడిగించింది. ఈ నేపథ్యంలో వారిని తిరిగి తీహార్ జైలుకు పోలీసులు తరలించారు.
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నాయకులైన అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు ఊరట లభించలేదు. వీరిద్దరి జ్యుడీషియల్ కస్టడీని మరో రెండు రోజులు పాటు కోర్టు పొడిగించింది. ఈ నేపథ్యంలో వారిని తిరిగి తీహార్ జైలుకు పోలీసులు తరలించారు. (No Relief For CJP) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు తెలిపేందుకు అనుమతిని పోలీసులు రద్దు చేసినప్పటికీ, అక్టోబర్ 13న అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ అక్కడి గేట్లను ఎక్కి లోపలికి ప్రవేశించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 14న వీరిని కోర్టులో ప్రవేశపెట్టగా మొదట ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. దీంతో వారిని తీహార్ జైలుకు తరలించారు.
కాగా, సోమవారంతో ఐదు రోజలు జ్యుడీషియల్ కస్టడీ ముగిసింది. దీంతో అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లను ఢిల్లీ పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే వారిని విడుదల చేస్తే శాంతిభద్రతలకు భంగం కలిగించవచ్చని వారు ఆరోపించారు. వారిద్దరినీ మరింత కాలం తమ కస్టడీకి అప్పగించాలని ఢిల్లీ పోలీసులు కోరారు. ఈ నేపథ్యంలో అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరో రెండు రోజులు పొడిగించింది. దీంతో వారిద్దరిని తిరిగి తీహార్ జైలుకు తరలించారు. అక్టోబర్ 21న తిరిగి వారిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
అయితే, ఆ ఇద్దరి వల్ల ఎలాంటి ముప్పు ఉందని గానీ, వారి విడుదల ప్రజాశాంతికి భంగం కలిగిస్తుందని గానీ సూచించడానికి ఒక్క ఆధారం కూడా లేదని సీజేపీకి చెందిన న్యాయ బృందం ఆరోపించింది. స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట విచారణకు ఢిల్లీ పోలీసులు, అధికారులు ఆటంకం కలిగిస్తున్నారని, మధ్యాహ్నం జరుగాల్సిన విచారణ చాలా గంటలు ఆలస్యమైందని సీజేపీ లీగల్ హెడ్ రత్న సింగ్ విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Ashutosh Ranka
- CJP
- court
- custody
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
No Relief For CJP | అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు.. కస్టడీని పొడిగించిన కోర్టు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

