Smoking | మీరు స్మోకింగ్ మానేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి!
ధూమపానం మాన్పించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తొలిసారి మార్గదర్శకాలను జారీచేసింది. పేద, మధ్యస్థాయి ఆదాయం గల దేశాలను దృష్టిలో ఉంచుకొని, అత్యంత తక్కువ వైద్య ఖర్చుతో ‘ధూమపానం’ నుంచి బయటపడే మార్గాలను ఇందులో వివరించింది.
- చికిత్స, కౌన్సెలింగ్‌పై తొలిసారి డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలు
- స్పల్ప ఖర్చుతో మెడికేషన్,బిహేవియరల్ థెరపీపై సూచనలు
- కౌన్సెలింగ్, డిజిటల్ సాధనాలు వాడాలని ప్రపంచదేశాలకు సలహా
Smoking | న్యూఢిల్లీ, జూలై 3: ధూమపానం మాన్పించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తొలిసారి మార్గదర్శకాలను జారీచేసింది. పేద, మధ్యస్థాయి ఆదాయం గల దేశాలను దృష్టిలో ఉంచుకొని, అత్యంత తక్కువ వైద్య ఖర్చుతో ‘ధూమపానం’ నుంచి బయటపడే మార్గాలను ఇందులో వివరించింది. డిజిటల్ సాధనాలు, కౌన్సెలింగ్‌ను ఉపయోగించాలని ప్రభుత్వాలకు సూచించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల పొగాకు ఉత్పత్తులు (సిగరెట్లు, వాటర్పైప్స్, సిగార్స్) వాడుతున్న దాదాపు 75 కోట్ల మందిని దృష్టిలో పెట్టుకొని, ఈ దురలవాటు నుంచి వారిని బయటపడేసేందుకు డబ్ల్యూహెచ్‌వో తొలిసారి గైడ్‌లైన్స్‌ను ప్రవేశపెట్టింది.
తక్కువ ఖర్చుతో అమలు
పొగతాగే అలవాటు మానాలనుకునే వారికి ముందుగా ‘బిహేవియరల్ సపోర్ట్’ అందించాలని పేర్కొన్నది. అత్యంత తక్కువ ఖర్చుతో దీనిని అందజేయవచ్చునని పేర్కొన్నది. వారెనిైక్లెన్, నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ, బ్యూప్రోపియాన్, సైటిసిన్.. మందులు చక్కటి ప్రభావం చూపుతాయని తెలిపింది. ‘ఆరోగ్య కార్యకర్తలతో స్వల్పకాలంపాటు కౌన్సెలింగ్ ఇప్పించాలి. ఫోన్ ద్వారా కౌన్సెలింగ్ తీసుకురావాలి. ప్రవర్తనలో మార్పునకు సహకరించాలి. అలాగే ఫోన్ ద్వారా టెక్ట్స్ మెసేజ్‌లు పంపాలి. స్మార్ట్‌ఫోన్ యాప్స్, ఇంటర్నెట్ కార్యక్రమాలతో వారికి సాయం చేయాలి’ అని సూచించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

