ఇష్టదైవం ప్రసాదం నేరుగా ఇంటికే : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల నుంచి ప్రసాదాలను (డ్రై పూట్స్ ) భక్తుల దగ్గరకు నేరుగా చేరవేసేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం పోస్టల్ శాఖ సేవలు వినియోగించుకుంటామని చెప్పారు. తపాలశాఖ ద్వారా ఇంటికే దేవుళ్ళ ప్రసాదాలు, మొబైల్ యాప్ ద్వారా పూజ సేవలను శనివారం అరణ్య భవన్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.
రాష్ట్రంలో ఎక్కడికైనా పంపే విధంగా ఏర్పాట్లు..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలోని 10 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల ప్రసాదాన్ని స్పీడ్ పోస్ట్‌లో రాష్ట్రంలో ఎక్కడికైనా పంపే విధంగా పోస్టల్ శాఖతో ఒప్పందం కుదుర్చకున్నామన్నారు. ప్రసాదం (డ్రై పూట్స్ ) హోం డెలివరీ కావాలనుకున్న భక్తులు నేరుగా ఏ పోస్ట్ ఆపీసుకైనా వెళ్లి బుక్ చేసుకోవచ్చని తెలిపారు. పోస్ట్ ఆఫీసులో భక్తులు తమకు నచ్చిన గుడిలో ప్రసాదాలకు రుసుం చెల్లిస్తే వారి పేరిట ప్రసాదాలను పోస్టు ద్వారా ఇంటికే పంపిస్తారని పేర్కొన్నారు. ఆర్డర్ చేసిన రెండు, మూడు రోజుల్లో ప్రసాదాన్ని స్పీడ్ పోస్టులో భక్తుల ఇంటికి డోర్ డెలివరీ చేస్తారని వివరించారు. దేశ వ్యాప్తంగా 1.60 లక్షల పోస్టాఫీసుల ద్వారా ఈ సేవలను పొందవచ్చన్నారు. దీంతో పాటు ఆలయ పూజ సేవల బుకింగ్ లను కూడా తపాల శాఖ ద్వారా అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. మొబైల్ యాప్ ద్వారా ఆన్ లైన్లో పూజ సేవలను బుక్ చేసుకోలేని వారికోసం పోస్ట్ ఆఫీసులో ఆఫ్ లైన్ ద్వారా ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నామని తెలిపారు.

అందుబాటులో ఈ పది ఆలయాల ప్రసాదం..
యాదాద్రి శ్రీ లక్ష్మినర్సింహాస్వామి దేవాస్థానం, భద్రచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం, వేములవాడ -శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం, బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి దేవస్థానం, కొండగట్టు అంజనేయస్వామి టెంపుల్, కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం, ఉజ్జయిని మహాంకాళీ ఆలయం, సికింద్రాబాద్ గణేష్ టెంపుల్, బల్కంపేట ఎల్లమ్మ- పోచమ్మ టెంపుల్, కర్మాన్‌ఘాట్ హనుమాన్ దేవాలయంలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఆన్లైన్ సేవల విస్తరణ..
అదేవిధంగా దేవస్థానాల్లో జరుగు నిత్య ఆర్జిత సేవల్లో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశము లేని భక్తులు అన్ని సేవలు పరోక్షముగా వారి గోత్ర నామములతో జరిపించడానికి ఆన్ లైన్ సేవలను విస్తరిస్తున్నామని తెలిపారు. దేవాదాయశాఖలోని మరో 15 ఆలయాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే 22 ప్రసిద్ధ ఆలయ సేవలను మొబైల్ యాప్ (T App Folio”) ద్వారా ఆన్ లైన్లో అందుబాటులోకి తెచ్చామన్నారు. అన్ని సేవలు పరోక్షముగా వారి గోత్ర నామములతో జరిపించడానికి ఈ మొబైల్ యాప్ ద్వారా ఆన్ లైన్లో బుక్ చేసుకోవచ్చని చెప్పారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, తెలంగాణ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఎస్. రాజేంద్ర కుమార్, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కృష్ణవేణి, హైదరాబాద్ రీజీయన్ పోస్ట్ మాస్టర్ జనరల్ పీవీఎస్ రెడ్డి, హైదరాబాద్ పోస్ట్ మాస్టర్ జనరల్ సాగర్ హనుమాన్ సింగ్, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీస్ ఎస్వీ రావు, తదితరులు పాల్గొన్నారు.

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

