Power cuts | కరెంటు కోతలను నిరసిస్తూ నార్సింగి సబ్‌స్టేషన్ ఎదుట రైతుల ధర్నా
పంటలకు నీరందించాల్సిన వేళ కరెంటు కోతలు.. కళ్లముందే ఎండిపోతున్న పంటలు.. అధికారుల తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాపన్నపేట, అక్టోబర్ 9: పంటలకు నీరందించాల్సిన వేళ కరెంటు కోతలు.. కళ్లముందే ఎండిపోతున్న పంటలు.. అధికారుల తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ శుక్రవారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగి సబ్‌స్టేషన్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో మెదక్–బోడ్మట్పల్లి రహదారిపై దాదాపు రెండు గంటల పాటు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
వ్యవసాయానికి సకాలంలో విద్యుత్ అందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ ఏడీఈ వెంకటేశ్వర్లు, ఏఈ నర్సింలు ఆందోళన స్థలానికి వచ్చి తమ సమస్యలకు సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. అనంతరం విద్యుత్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ ఆందోళనలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, కిసాన్ మోర్చా నాయకులు, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power cuts | కరెంటు కోతలను నిరసిస్తూ నార్సింగి సబ్‌స్టేషన్ ఎదుట రైతుల ధర్నా
AICWA | తనుశ్రీ దత్తా వ్యాఖ్యలపై ఏఐసీడబ్ల్యూఏ ఆగ్రహం.. ‘ఈవిల్ డెడ్’ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సినీ సంఘం!
KTR | కేసులు నమోదైన రైతులను పరామర్శించిన కేటీఆర్, మాజీ మంత్రులు
Steven Smith | స్మిత్ ఖాతాలో మరో మైలురాయి.. మూడో ఆస్ట్రేలియన్‌గా రికార్డు..!
Hanuman Ansh | ‘హనుమాన్ అంశ్’ రివ్యూ.. నీమ్ కరోలీ బాబా జీవితం తెలుగువారిని మెప్పించిందా..?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

