కరెంట్ లేక ఎండిపోతున్న పంటలు.. హద్నూర్ సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు
పంటలకు సక్రమంగా నీరు అందించలేక పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హద్నూర్ గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ను గురువారం రైతులు ముట్టడించారు.
జహీరాబాద్, అక్టోబర్ 7 : వ్యవసాయానికి సరఫరా చేస్తున్న త్రీ ఫేజ్ కరెంటులో వోల్టేజ్ సమస్యతో పంటలకు సక్రమంగా నీరు అందించలేక పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హద్నూర్ గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ను గురువారం రైతులు ముట్టడించారు. గత కొన్ని రోజులుగా వ్యవసాయానికి ఇస్తున్న త్రీ ఫేజ్ కరెంటు సక్రమంగా సరఫరా కావడం లేదని, సరఫరా అవుతున్న సమయంలో పలుమార్లు కోతలు విధిస్తున్నారని, లో-వోల్టేజీతో మోటార్లు నడవక కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా సాగులో ఉన్న చెరకు, పత్తి పంటలు నీరు లేక ఎండిపోతున్నాయన్నారు.
నాణ్యమైన కరెంటును నిరంతరంగా ఇవ్వాలంటూ సబ్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు అక్కడికి చేరుకోవడంతో రైతులు ఘెరావ్ చేసి తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. గ్రామంలో పలు వార్డుల్లో సింగిల్ ఫేజ్ ట్రాన్స్ ఫార్మర్లు అవసరం ఉన్నాయని, విద్యుత్ వైర్ల వెంట చెట్ల కొమ్మలు ఉండడంతో అంతరాయం ఏర్పడుతోందని, వాటిని తొలగించాలని రైతులు కోరారు. గ్రామానికి ప్రత్యేక సింగిల్ ఫేజ్ లైన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై అధికారులు స్పందిస్తూ.. వ్యవసాయానికి ఉదయం 7:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తామని, ఆ మధ్యలో పోయిన కరెంటును తిరిగి రాత్రి 8 గంటల తర్వాత ఎన్ని గంటలు పోతే అన్ని గంటల పాటు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించేందుకు సబ్ స్టేషన్‌ను స్థాయిని పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
అలాగే గ్రామంలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. సమస్యలు పరిష్కారం కాకపోతే మళ్లీ సబ్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రవీణ్ కుమార్, గ్రామ నాయకులు రాజ్ కుమార్, షబ్బీర్ ఖాన్, మల్లన్న, శివ పటేల్, పవన్ పటేల్, మాణిక్ రెడ్డి, రమేష్, మహేష్, వీరేందర్, శ్రీశైలం, సతీష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరెంట్ లేక ఎండిపోతున్న పంటలు.. హద్నూర్ సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు
Candidates Ultimatum | టీజీపీఎస్సీకి గ్రూప్-1 అభ్యర్థుల అల్టిమేటం.. జీఆర్ఎల్ ఇవ్వకుంటే ఆమరణ దీక్ష
Narendra Modi | నోయిడాలోని జెవార్ ఎయిర్‌పోర్టుకు నరేంద్ర మోదీ పేరు.. ప్రకటించిన యూపీ సీఎం యోగి
గ్రామాల్లో ఎక్సైజ్ దాడులు.. నాటుసారా, బెల్లం పానకం పట్టివేత
Bus Collides With Truck | లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ మృతి, 12 మంది ప్రయాణికులకు గాయాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

