ఇల్లంతకుంట, మే 28 : కొయ్యకాలు తగులబెడుతుండగా ఊపిరాడక ఓ రైతు మృతి చెందిన విషాదకర ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లిలో చోటుచేసుకున్నది. తాళ్లపెల్లికి చెందిన రైతు ఎలుక నారాయణ (70) వానకాలం సాగు కోసం తన ఎకరన్నర పొలంలో కొయ్యకాలును గురువారం తగులపెట్టాడు.
ఈదురుగాలులు వీయడంతో పొగ చుట్టుముట్టి ఊపిరి ఆడక నారాయణ స్పృహ తప్పి కిందపడిపోయాడు. గమనించిన చుట్టుపక్కల రైతులు వెంటనే సిరిసిల్ల దవాఖానకు తరలించగా, అప్పటికే నారాయణ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.