ఊర్కొండ, అక్టోబర్ 5 : కరెంట్ మోటర్ వద్ద తట్టుకున్న నాచును తొలగించే క్రమం లో విద్యుదాఘాతానికి గురై రైతు మృతిచెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లికి చెందిన రైతు శ్యామ్ (39) వేరుశనగ పంట సాగుచేశాడు.
సమీప గ్రామమైన రాచాలపల్లి శివారులో ఉన్న కేఎల్ఐ కాలువలో మరో రైతుకు చెందిన మోటర్ నీళ్లు తక్కువ గా ఎత్తిపోస్తుండటం తో శ్యామ్ కాలువలోకి దిగి పరిశీలించాడు. నీటిలోపల బోరు వద్ద తట్టుకొన్న నాచును తీస్తుండగా విద్యుత్తుషాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.