పట్టాదారు పాసుపుస్తకం రాలేదని రైతు ఆత్మహత్య
క్రైం న్యూస్ | పట్టాదారు పాస్ పుస్తకం రావట్లేదని మనస్థాపం చెందిన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

జనగామ : పట్టాదారు పాస్ పుస్తకం రావట్లేదని మనస్థాపం చెందిన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జిల్లాలోని పాలకుర్తి మండలం శాతాపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై గండ్రాతి సతీశ్ కథనం ప్రకారం.. ఐలేని వెంకటయ్య (58)కు గ్రామంలో సర్వే నంబర్ 54, 55లో నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉంది. అతడు 40-50 ఏండ్ల నుంచి వ్యవ సాయం చేసుకుంటున్నాడు.
ఈ క్రమంలో తన భూమి అన్న ఐలేని రామయ్య పేర పట్టాదారు పాసుపుస్తకం అయింది. ఎన్ని సార్లు అడిగినా, పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు పెట్టినా ఫలితం లేకపోయింది. రామయ్య తప్పించుకుని తిరిగాడు తప్ప వెంకటయ్య పేరు మీద పాసు పుస్తకం చేయలేదు. దీంతో వెంకటయ్య పలు మార్లు ఆర్డీవో, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు.
రైతుబంధు డబ్బులు పోతున్నాయి.. పట్టాదారు పాసుపుస్తకం వస్తలేదని మనస్తాపం చెందిన వెంకటయ్య గురువారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు భిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
టీఆర్ఎస్లోకి వెల్లువలా చేరికలు
అశ్రు నయనాలతో చందూలాల్‌కు అంతిమ వీడ్కోలు
మంత్రి వేముల సమక్షంలో టీఆర్ఎస్లో చేరికలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

