Gadwal Collector | కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రిజ్వాన్ బాషా షేక్
Gadwal Collector | సైబర్ నేరగాళ్లు ఏకంగా గద్వాల కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించారు. సకాలంలో స్పందించిన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు.
జోగులాంబ గద్వాల : సైబర్ నేరగాళ్లు ( Cybercriminals ) ఏకంగా గద్వాల కలెక్టర్ ( Gadwal Collector ) పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించారు. సకాలంలో స్పందించిన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ( Rizwan Basha Shaik ) సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కలెక్టర్ పేరు,ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని, ఆయన పేరు, 8974808916 నంబర్‌తో ప్రజలకు సందేశాలు పంపిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు కలెక్టర్ దృష్టికి వచ్చింది.
స్పందించిన కలెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల పేరుతో డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. తన పేరుతో డబ్బులు కోరుతూ వచ్చే సందేశాలు పూర్తిగా నకిలీవని, వాటిని ఎవరూ నమ్మవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు పంపి మోసపోవద్దని జిల్లా కలెక్టర్ ప్రజలకు స్పష్టం చేశారు.ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న వారిపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించినట్లు వెల్లడించారు.
వాట్సాప్‌లో లేదా సోషల్ మీడియాలో కలెక్టర్ ప్రభుత్వ అధికారుల ఫొటోలు,పేర్లు, హోదాలు కనిపించినంత మాత్రాన అవి నిజమైన ఖాతాలని నమ్మవద్దని తెలిపారు. ప్రభుత్వ అధికారులు,జిల్లా కలెక్టర్ పేర్లను దుర్వినియోగం చేస్తూ ప్రజలను మోసం చేయడం తీవ్రమైన నేరమని,ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gadwal Collector | కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రిజ్వాన్ బాషా షేక్
Sonia Gandhi meets Lalu Yadav | లాలూను కలిసిన సోనియా గాంధీ.. యూపీఏ పాలన, విధానాలను గుర్తు చేసుకున్న నేతలు
Health tips | మీకు డయాబెటిస్ ఉందా.. అయితే బొబ్బర్లతో ఎన్ని లాభాలో తెలుసా..?
Cult | విశ్వక్ సేన్‌కు ‘కల్ట్’ డబుల్ షాక్.. ‘లైలా’ కంటే తక్కువ వసూళ్లు, ఇకపై సినిమాల ఎంపికే కీలకం!
Raptadu case | రాప్తాడు నిందితుడిపై కాల్పుల ఘటనపై ఏపీ హైకోర్టులో పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

