బజార్ హత్నూర్ : మండలంలో చందునాయక్ తండాలో విద్యుదాఘాతంతో (Electrocution) ఒకరికి తీవ్రగాయాలు ( seriously injured ) అయ్యాయి. తండాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు రంగులు వేయడానికి ఉత్తరప్రదేశ్( Utterpradesh) మహారాజ్ గంజ్ జిల్లాకు చెందిన కూలీలు వచ్చారు. సోమవారం సోను కూలీ టేబుల్ పైకి ఎక్కి రంగులు వేస్తూండగా విద్యుత్ వైర్లు తగిలి కిందపడ్డాడు. దీంతో అతడి తలకు గాయాలు కావడంతో సహచర కూలీలు హుటాహుటినా బజార్ హత్నూర్ ప్రాథమిక ఆసుపత్రి కి తరలించారు. వైద్య ధికారి డాక్టర్ శిల్ప ప్రాథమిక చికిత్స అందించిమెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రం లోని రిమ్స్ కు తరలించారు.