అక్టోబర్లో 95 శాతం లోటు వర్షపాతం
నైరుతి రుతుపవనాలు తిరోగమించే అక్టోబర్ నెలలో తెలంగాణలో అకడకడా వర్షాలు కురుస్తుంటాయి. హైదరాబాద్ నగరంలోనైతే కాస్త ఎకువగానే వానలు పడుతుంటాయి. 2020 అక్టోబర్లో భాగ్యనగరంలో ఏకంగా 400 మి.మీ. వర్షం కురిసింది. అయితే ఈసారి ఎల్ నినో కారణంగా పరిస్థితి పూర్తిగా తలకిందులైంది.
- జిల్లాల్లో రాలని వానచినుకు
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : నైరుతి రుతుపవనాలు తిరోగమించే అక్టోబర్ నెలలో తెలంగాణలో అకడకడా వర్షాలు కురుస్తుంటాయి. హైదరాబాద్ నగరంలోనైతే కాస్త ఎకువగానే వానలు పడుతుంటాయి. 2020 అక్టోబర్లో భాగ్యనగరంలో ఏకంగా 400 మి.మీ. వర్షం కురిసింది. అయితే ఈసారి ఎల్ నినో కారణంగా పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. అక్టోబర్ తొలి మూడు వారాల్లో రాష్ట్రంలో ఏకంగా 95 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 12 జిల్లాల్లో ఈ మూడు వారాల్లో చినుకు జాడ లేదు. మిగతా 21 జిల్లాల్లోనూ భారీ లోటు నమోదైంది.
సాధారణంగా అక్టోబర్ నెల తొలి మూడు వారాల్లో రాష్ట్రంలో 75.6 మి.మీ. వర్షం కురుస్తుంది. కానీ ఈసారి కేవలం 5.3 మిల్లీమీటర్ల వర్షమే కురిసింది. దీని ప్రభావం పంటలపై, భూగర్భ జలాలపై పడే అవకాశం కనిపిస్తున్నది. హనుమకొండ, జయశంకర్ భూపాపల్లి, జగిత్యాల, కరీంనగర్, మేడ్చల్-మలాజిగిరి, మంచిర్యాల, మెదక్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఈ 21 రోజుల్లో వర్షం చుక కూడా పడలేదు. ఎల్ నినో ప్రభావంతో ఎకువ రోజులపాటు వర్షం కురువకపోవడం వల్ల నేలలో తేమ స్థాయిలు తగ్గుతాయని, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నీటి లభ్యత తగ్గుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

