రేపటి నుంచి ఈసెట్ వెబ్ ఆప్షన్లుబీటెక్ సెకండియర్ కోర్సుల్లోని సీట్ల భర్తీకి నిర్వహించే ఈసెట్ వెబ్ ఆప్షన్లు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 17నుంచి 21వరకు విద్యార్థులు వెబ్ఆప్షన్లు ఎంచుకోవచ్చు. 17 నుంచి 19వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. సీట్లను 24న కేటాయిస్తారు.
రేపటి నుంచి పాలిసెట్ ఆప్షన్లు : టీజీ పాలిసెట్ తుది విడత వెబ్ ఆప్షన్లు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 16,17 తేదీల్లో ఆప్షన్లు ఎంచుకోవచ్చు. 20న సీట్లు కేటాయిస్తారు.