న్యూయార్క్, జూన్ 15 : సాధారణంగా కొత్త స్మార్ట్‌ఫోన్‌కు మారిన తర్వాత ఓల్డ్ స్మార్ట్ ఫోన్లు రీసైక్లింగ్‌కు ఇస్తుంటారు ఎవరైనా. అయితే గూగుల్ మాత్రం పాత స్మార్ట్ఫోన్లతో ప్రయోగాలు చేస్తున్నది. ఈ విషయాన్ని ఈ టెక్ కంపెనీ వెల్లడించింది. గూగుల్ రిసెర్చ్ ప్రకారం.. ఓల్డ్ స్మార్టుఫోన్లు పవర్ క్లౌడ్ అప్లికేషన్లు, ప్రాజెక్టు రిసెర్చ్‌లు, విద్యా వేదికలకు పవర్ జనరేట్ చేయడానికి గూగుల్ ఉపయోగించనుంది. దీని వల్ల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు తగ్గడంతో పాటు పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గిస్తుంది. కాలిఫోర్నియా యూనివర్సిటీ శాన్ డియాగోతో కలిసి గూగుల్ ఈ రిసెర్చ్ నిర్వహించింది. దీనికి ఫోన్ క్లస్టర్ కంప్యూటింగ్ అని పేరు పెట్టింది.
పాత స్మార్ట్ఫోన్లను పారవేయడానికి బదులుగా దానిలోని హార్డ్‌వేర్‌ను రీయూజ్ చేయొచ్చని గూగుల్ రిసెర్చ్ చెబుతున్నది. ఫోన్లోని అవసరం లేని డిస్ ప్లే, ఔటర్ రింగ్స్, బ్యాటరీ లాంటి వాటిని పక్కన పెట్టేసి మదర్ బోర్డు, ప్రాసెసర్, మెమొరీని లినక్స్ ఆధారంగా పనిచేసే సిస్టమ్ వాడకంలో ఉపయోగిస్తారు. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రూపొందించడంలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. 25 నుంచి 50 స్మార్ట్ఫోన్లతో క్లౌడ్ సర్వీసుల్లో ఉపయోగించే కంప్యూటింగ్ సిస్టమ్స్‌ను క్రియేట్ చేయొచ్చు.