రవితేజ పాంచ్ పటాకా
హిట్లు, ఫ్లాపుల గురించి పట్టించుకోకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటారు అగ్ర హీరో రవితేజ. ఈ క్రమంలోనే ‘ధమాకా’ లాంటి భారీ విజయాలు ఆయన ఖాతాలో పడుతుంటాయి. నిజానికి ‘ధమాకా’ తర్వాత ఆయనకు సరైన విజయం లేదు.
హిట్లు, ఫ్లాపుల గురించి పట్టించుకోకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటారు అగ్ర హీరో రవితేజ. ఈ క్రమంలోనే ‘ధమాకా’ లాంటి భారీ విజయాలు ఆయన ఖాతాలో పడుతుంటాయి. నిజానికి ‘ధమాకా’ తర్వాత ఆయనకు సరైన విజయం లేదు. అయినా ఆయన డైరీ మాత్రం ఎప్పుడూ ఫుల్‌గానే ఉంటుంది. ప్రస్తుతం ‘ఇరుముడి’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. తండ్రీ,కూతుళ్ల అనుబంధమే ప్రధాన ఇతివృత్తంగా రూపొందుతున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. త్వరలోనే సినిమా విడుదల కానున్నది.
దీని తర్వాత దిల్ రాజు సంస్థలో ఓ సినిమా చేయబోతున్నారు రవితేజ. ఓ కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడట. ఇక దర్శకుడు వివేక్ ఆత్రేయ కూడా లైన్లోనే ఉన్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో కూడా సినిమా ఉంటుందని తెలుస్తున్నది. ఇక రవితేజ కోసం తమిళ దర్శకుడు హరి ఓ కథ సిద్ధం చేశారట. మాస్ అంశాలతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తున్నది. దర్శకుడు మారుతీ సైతం ఇటీవలే రవితేజకు ఓ కథ వినిపించారట. మొత్తానికి రవితేజ లైనప్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గానే ఉంది. అయితే.. వీటికి చెందిన అధికారిక ప్రకటనలు మాత్రం రావాల్సివుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

