న్యూఢిల్లీ: వయస్సు పెరిగినా కూడా ఆరోగ్యంగా ఉండేందుకు, ఎక్కువ కాలం జీవించేందుకు ఓ రకమైన యోగర్ట్‌ను గువాహటిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు రూపొందించారు. లాక్టోబాసిల్లస్ ప్లాంటేరమ్ మాదిరిగా ఉండే లాక్టోబాసిల్లస్ ప్లాంటేరమ్ జేబీసీ-5 అనే బ్యాక్టీరియాను గుర్తించారు. శరీరంలో ఆక్సీకరణ చర్యలను నిలిపేసి, వయస్సు కారణంగా వచ్చే సమస్యలను ఇది తగ్గిస్తుందన్నారు.