హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జంట హత్యలు కలకం సృష్టిస్తున్నాయి. నూరుఖాన్ బజార్ ( Noorkhan ) లో అదిల్ ఖాన్ అనే వ్యక్తి అతని సోదరుడు అఖ్వీల్ ఖాన్ ( Akvil Khan ) ,అజ్మీరి బేగం ( Azmeer Begam ) అనే ఇద్దరిని ఇంట్లో దారుణంగా హత్య చేసి పరారయ్యాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీం తో ఆధారాలు సేకరిస్తూ, కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలు పై ఆరా తీస్తున్నారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.