Minister Ponnam Prabhakar | త్వరలోనే అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు : మంత్రి పొన్నం ప్రభాకర్
Minister Ponnam Prabhakar | జిల్లాలో అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లుకేటాయిస్తామని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
హైదరాబాద్ : జిల్లాలో అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు(Double bedroom houses) కేటాయిస్తామని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి, సంక్షేమంతో పాటు పెండింగ్ పనుల పురోగతి వంటి పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా ఉన్న సమస్యలు, పురోగతి, అభివృద్ధి గురించి అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో ఏడు ప్రాంతాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. జీహెచ్ఎంసీ (GHMC) అధికారులతో సమన్వయం చేసుకుని డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తామన్నారు. జిల్లా అధివృద్ధిలో ప్రభుత్వం, అధికారులు కలిసి పని చేయాల్సి ఉందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా జిల్లాలో ఫిష్ మార్కెట్లు కొత్తగా నిర్మించే ఆలోచన ఉందని వివరించారు. అవసరమైతే ప్రతి మండలంలో ఒక ఫిష్ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మేరకు ఆ శాఖ అధికారులు కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు పెరిగిన డైట్ ఛార్జీలు అమలు చేస్తామన్నారు. జీవో 58, 59 జీవోలకు సంబంధించిన అంశాలను కూడా సమీక్షిస్తామని మంత్రి తెలిపారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ భవన (District Collectarate Buildings) నిర్మాణం చేపడుతామని వెల్లడించారు. సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అడిషనల్ కలెక్టర్ మధుసూదన్, డీఆర్వో వెంకటాచా, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

