Anil Menon | అంతరిక్షయాత్రకు సిద్ధమవుతున్న అనిల్ మేనన్
Anil Menon | ఇండో-అమెరికన్ (Indo-American) వ్యోమగామి (Astronaut) అనిల్ మేనన్ (Anil Menon) అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్నారు. అనిల్ జూలై 14న ప్రారంభం కానున్న అంతర్జాతీయ అంతరిక్ష యాత్రకు ఆయన మరో ఇద్దరు వ్యోమగాములు ప్యోటర్ డుబ్రోవ్, అన్నా కికినాతో కలిసి వెళ్లనున్నారు. వారు 240 రోజులపాటు కక్ష్యలో గడపనున్నారు.
Anil Menon : ఇండో-అమెరికన్ (Indo-American) వ్యోమగామి (Astronaut) అనిల్ మేనన్ (Anil Menon) అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్నారు. అనిల్ జూలై 14న ప్రారంభం కానున్న అంతర్జాతీయ అంతరిక్ష యాత్రకు ఆయన మరో ఇద్దరు వ్యోమగాములు ప్యోటర్ డుబ్రోవ్, అన్నా కికినాతో కలిసి వెళ్లనున్నారు. వారు 240 రోజులపాటు కక్ష్యలో గడపనున్నారు. జూన్ 22న అనిల్ మేనన్ ఇంటర్వ్యూలు ఇస్తారని నాసా (NASA) వెల్లడించింది. భారత్, ఉక్రెయిన్ తల్లిదండ్రులకు జన్మించిన అనిల్ మేనన్ అమెరికాకు చెందిన పౌరుడు.
2021లో ఆయన వ్యోమగామిగా ఎంపికయ్యారు. 2024లో 23 ఆస్ట్రోనాట్ క్లాస్ గ్రాడ్యుయేట్ అయ్యారు. అంతకుముందు హార్వర్డ్ నుంచి న్యూరోబయాలజీలో బ్యాచిలర్ డిగ్రీ, స్టాన్ఫోర్డ్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్, మెడికల్లలో మాస్టర్ డిగ్రీలను అందుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆయన వ్యోమగామిగానే కాకుండా ఎమర్జెన్సీ మెడిసిన్ ఫిజీషియన్, మెకానికల్ ఇంజినీర్, అమెరికా స్పేస్‌ఫోర్స్ కర్నల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
వ్యోమగామి కాకముందు అనిల్ మేనన్ నాసా ఎక్స్‌పెడిషన్ ఫ్లైట్ సర్జన్‌గా పనిచేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములకు సహకరించేవారు. 2021లో నాసా తన వ్యోమగాముల బృందంలో అనిల్‌ను ఎంపిక చేసింది. రెండేళ్ల శిక్షణ తర్వాత 2024లో ఆయన వ్యోమగామిగా పట్టభద్రుడయ్యారు. నాటి నుంచి కక్ష్యలోకి తన మొదటి అంతరిక్ష యాత్ర కోసం సిద్ధమవుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

