మన శరీరానికి క్రోమియం ఎందుకు అవసరమో తెలుసా..?

మన శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాల్లో క్రోమియం కూడా ఒకటి. ఇది మినరల్స్ జాబితాకు చెందుతుంది. క్రోమియం వల్ల మన శరీరానికి అనేక ఉపయోగాలు ఉంటాయి. దీంతో శరీరంలోని క్లోమగ్రంథి విడుదల చేసే ఇన్సులిన్ను శరీరం సరిగ్గా ఉపయోగించుకుంటుంది. ఈ క్రమంలో టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. అలాగే మహిళల్లో రుతుక్రమం సరిగ్గా అవుతుంది. ఆకలి నియంత్రణలో ఉంటుంది. అధిక బరువు తగ్గుతారు.
ఇక మనకు క్రోమియం అనేక పదార్థాల్లో లభిస్తుంది. ఆపిల్స్, అవకాడో, టమాటాలు, పిస్తా పప్పు, బ్రొకొలి, పసుపు, డార్క్ చాకొలెట్లు, గ్రీన్ టీ తదితర ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల మన శరీరానికి క్రోమియం అందుతుంది. 6 నెలల వయస్సు లోపు ఉన్న చిన్నారులకు నిత్యం 0.2 మైక్రోగ్రాముల క్రోమియం అవసరం. అదే 7-12 నెలల వయస్సు ఉన్న వారికి 5.5 మైక్రోగ్రాములు, 1-3 వయస్సుల వారికి 11 మైక్రోగ్రాములు, 4-6 వయస్సు వారికి 15 మైక్రోగ్రాములు, 9 – 13 ఏళ్ల వారికి 25 మైక్రోగ్రాములు, 14 నుంచి 50 ఏళ్ల లోపు వారికి 35 మైక్రోగ్రాముల క్రోమియం నిత్యం అవసరం అవుతుంది. అదే మహిళలకు అయితే 21 నుంచి 25 మైక్రోగ్రాముల వరకు, గర్భిణీలకు 30 మైక్రోగ్రాములు, పాలిచ్చే తల్లులకు 45 మైక్రోగ్రాముల వరకు నిత్యం క్రోమియం అవసరం అవుతుంది. ఇక వైద్యుల సలహాతో క్రోమియం ట్యాబ్లెట్లను కూడా తీసుకోవచ్చు. దీంతో క్రోమియం లోపం రాకుండా చూసుకోవచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gold price | బంగారం మళ్లీ ఆల్టైమ్ హై?.. వచ్చే రెండేండ్లలో చేరవచ్చన్న అంచనాలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
West Bengal | కోల్కతా నవరాత్రుల్లో విషాదం.. 17 మంది దుర్మరణం
India vs West Indies | వరుణుడే విజేత.. ఐదో టీ20 వాన ఖాతాలోకి.. 2-2తో సిరీస్ పంచుకున్న భారత్, విండీస్
KTR | బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా.. మెరుగైన వైద్యానికి సాయం చేస్తానని హామీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

