Health tips | షుగర్ పేషెంట్లు కార్న్‌ఫ్లేక్స్ తినొద్దా.. తింటే ఏమవుతుంది..?
Health tips : ఈ మధ్యకాలంలో షుగర్, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. ఒకసారి మధుమేహం వస్తే ఇక దాని నుంచి పూర్తిగా బయటపడటం అసాధ్యం. కానీ కొన్ని ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం ద్వారా వ్యాధిని అదుపులో పెట్టుకోవచ్చు. డయాబెటిస్ బారినపడిన చాలామంది రకరకాల ఆహారపు అలవాట్లతో షుగర్ స్థాయిలను అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. ముఖ్యంగా మిల్లెట్స్ షుగర్ నియంత్రణకు బాగా పనిచేస్తాయి.
Health tips : ఈ మధ్యకాలంలో షుగర్, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. ఒకసారి మధుమేహం వస్తే ఇక దాని నుంచి పూర్తిగా బయటపడటం అసాధ్యం. కానీ కొన్ని ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం ద్వారా వ్యాధిని అదుపులో పెట్టుకోవచ్చు. డయాబెటిస్ బారినపడిన చాలామంది రకరకాల ఆహారపు అలవాట్లతో షుగర్ స్థాయిలను అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. ముఖ్యంగా మిల్లెట్స్ షుగర్ నియంత్రణకు బాగా పనిచేస్తాయి.
మధుమేహులు తియ్యని ఆహార పదార్థాల జోలికి అస్సలు వెళ్లరు. అదేవిధంగా రైస్‌ను కూడా ఒక్కపూటకే పరిమితం చేస్తారు. మిల్లెట్స్ డయాబెటిస్ నియంత్రణలో కీలకం కాబట్టి ఎక్కువగా చిరుధాన్యాలతో చేసిన వంటకాలు, రొట్టెలనే తింటుంటారు. జొన్న, సజ్జ, మక్కజొన్న, రాగులు, ఊదలు, కొర్రలు, అవిసెలు, అరికలు వంటి ధాన్యాలతో తయారు చేసిన వంటకాలనే ఎక్కువగా తీసుకుంటారు. అయితే మక్కజొన్న సంబంధిత ఉత్పత్తే అయినా కార్న్ ఫ్లేక్స్ జోలికి వెళ్లరు. ఎందుకంటే అవి షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరమట.
అందుకే మధుమేహులు తినకూడని ఆహారపదార్థాల్లో కార్న్ ఫ్లేక్స్ కూడా ఒకటిగా మారిపోయింది. కార్న్‌ఫ్లేక్స్ చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వాటిని చూడగానే ఎవరికైనా వెంటనే తినాలనే కోరిక కలుగుతుంది. కానీ డయాబెటిస్ ఉన్నవారికి ఇవి ఏ మాత్రం పనికిరావు. వాటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ (జీఐ) ఎక్కువగా ఉంటుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు బాగా పెరుగుతాయి. తరచూ గ్లూకోజ్ స్థాయిలు పెరిగితే ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి మధుమేహులు కార్న్ ఫ్లేక్స్‌కు ఎంత దూరం ఉంటే అంత మంచిది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

