Tholi Prema Katha | ‘తొలి ప్రేమ కథ’ థియేటర్లో చూడాల్సిన సినిమా.. టీజర్ అదుర్స్ : డైరెక్టర్ శైలేష్ కొలను!
Tholi Prema Katha | సాత్విక్ వర్మ, అనీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న పీఈఆర్ఎఫ్ లవ్‌స్టోరీ చిత్రం ‘తొలి ప్రేమ కథ’. లిఖిత్, ఆదిత్య సమర్పణలో లతా కే నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి లక్ష్మణ్ అల్లు దర్శకత్వం వహిస్తున్నారు.
Tholi Prema Katha | సాత్విక్ వర్మ, అనీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న పీఈఆర్ఎఫ్ లవ్‌స్టోరీ చిత్రం ‘తొలి ప్రేమ కథ’. లిఖిత్, ఆదిత్య సమర్పణలో లతా కే నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి లక్ష్మణ్ అల్లు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ చాలా వైభవంగా జరిగింది. ఈ వేడుకకు యువ హీరో ఆకాష్ పూరి, ప్రముఖ దర్శకుడు శైలేష్ కొలను ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. ప్రస్తుత సీజన్‌కు సరిగ్గా సరిపోయే మూడ్‌లో ‘తొలి ప్రేమ కథ’ టీజర్ ఉందని, ఇలాంటి హాయిగా సాగే సహజమైన సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన సాత్విక్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడని, తన కష్టం టీజర్లో స్పష్టంగా కనిపిస్తోందని కొనియాడారు. సినిమాటోగ్రఫీ, ధ్రువన్ అందించిన అద్భుతమైన మెలోడీ మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్ అవుతాయని, ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని థియేటర్లలోనే చూడాలని పిలుపునిచ్చారు.
యువ హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ.. చిత్రంలోని విజువల్స్ ఎంతో బ్యూటిఫుల్‌గా ఉన్నాయని ప్రశంసించారు. సాత్విక్, అనీలు చిన్నప్పటి నుంచి తనకు పరిచయమని, ఇద్దరూ అద్భుతమైన నటులని పేర్కొంటూ ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
హీరో సాత్విక్ వర్మ మాట్లాడుతూ.. తనకు ఎంతో సపోర్ట్ చేసిన డైరెక్టర్ శైలేష్ కొలనుకు, హీరో ఆకాష్ పూరికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదొక చక్కటి మ్యూజికల్ లవ్ స్టోరీ అని, సంగీత దర్శకుడు ధ్రువన్ అందించిన బాణీలు సినిమాకు ప్రాణం పోశాయని చెప్పారు. నిర్మాత, దర్శకులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు థియేటర్లలో చూసి ఆదరించాలని కోరారు.
దర్శక-నిర్మాత సాయి లక్ష్మణ్ అల్లు మాట్లాడుతూ.. ఈ కథను రాసుకున్నప్పుడే సాత్విక్, అనీలను ఊహించుకున్నానని, అనుకున్నదానికంటే సినిమా అత్యంత అద్భుతంగా వచ్చిందని తెలిపారు. నేచురల్ లొకేషన్స్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం అందరి మనసులను హత్తుకుంటుందని నమ్మకం వ్యక్తం చేశారు.
సంగీత దర్శకుడు ఆర్.ఆర్. ధ్రువన్ మాట్లాడుతూ.. ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమని, పోస్టర్‌పై తన పేరు వేయడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొని సినిమా విజయం సాధించాలని కోరుకున్నారు.
ఈ చిత్రంలో సాత్విక్ వర్మ మరియు అనీ నటీనటులుగా నటించగా, లిఖిత్, ఆదిత్య సమర్పణలో లతా కె నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి లక్ష్మణ్ అల్లు దర్శకత్వం వహిస్తున్నారు మరియు తులసి కృష్ణ ఏడ్ల ఈ చిత్రాన్ని క్రియేట్ చేయగా, ఆర్.ఆర్. ధ్రువన్ సంగీతం అందిస్తున్నారు, ఇథు కథ అందించగా, రామ్ కంధ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు, ఆర్.ఆర్. ధ్రువన్ మరియు అలరాజు లిరిక్స్ అందించగా, సునీల్ పొన్నం కొరియోగ్రఫీ, నందు స్టంట్స్, హరి శంకర్ ఎడిటింగ్, వెంకట్ కలరిస్ట్ బాధ్యతలు నిర్వహించగా, మాయాబజార్ పబ్లిసిటీ డిజైన్స్ అందిస్తున్నారు మరియు తేజస్వి సజ్జా పీఆర్ఓగా వ్యవహరిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tholi Prema Katha | ‘తొలి ప్రేమ కథ’ థియేటర్లో చూడాల్సిన సినిమా.. టీజర్ అదుర్స్ : డైరెక్టర్ శైలేష్ కొలను!
Mamata Banerjee | రండి, మా పైనుంచే బుల్డోజర్లు నడపండి.. బెంగాల్ సర్కారుపై మమతాబెనర్జి ఫైర్..!
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ఉపాధి కోసం ఆంధ్రా వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

