
ఎల్బీనగర్, నవంబర్ 14 : జాతీయ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్‌కు అనుబంధంగా ఉన్న తెలంగాణ పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్ నూతన చైర్మన్‌గా ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఎన్నికయ్యారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు ఇండియన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ 2021 పోటీలను ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ చైర్మన్ రాజశేఖర్‌రెడ్డి, అధ్యక్షుడు ఓం ప్రకాశ్, ఉపాధ్యక్షుడు రంగేశ్వరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, నాయకులు అనంతుల రాజారెడ్డి, చిరంజీవి, కత్తుల రాంబాబు, టంగుటూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.