Murder mystery | అమ్మపై శానిటైజర్ చల్లి.. నాన్నే నిప్పంటించాడు.. కన్నతండ్రిపై కూతురు ఫిర్యాదు
అమ్మకు ప్రమాదవశాత్తు నిప్పంటుకోలేదు. నాన్ననే శానిటైజర్ చల్లి నిప్పంటించాడు. నేను అడ్డుపడినా వినకుండా అమ్మను దహనం చేశాడు అని కన్న కూతురు తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
- తల్లి మృతి అనంతరం కూతురు ఫిర్యాదు
- మలుపు తిరిగిన ప్రమాదవశాత్తు మహిళకు నిప్పంటుకున్న కేసు
- కూతురు ఫిర్యాదుతో హత్యకేసుగా నమోదు
మేడ్చల్, మార్చి 7 : అమ్మకు ప్రమాదవశాత్తు నిప్పంటుకోలేదు. నాన్ననే శానిటైజర్ చల్లి నిప్పంటించాడు. నేను అడ్డుపడినా వినకుండా అమ్మను దహనం చేశాడు అని కన్న కూతురు తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కూతురు ఫిర్యాదుతో మొదట ప్రమాదశాత్తుగా నమోదైన కేసు, మలుపు తిరిగి, హత్య కేసుగా మారింది. ఈ ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
దేవుడికి దీపం పెట్టిన సందర్భంలో చీరకు నిప్పంటుకొని, కాలి గాయపడినట్లు బాధితురాలు మొదట వాగ్మూలం ఇచ్చింది. బాధితురాలు చికిత్స పొందుతూ మృతిచెందిన అనంతరం ఆమె కూతురు తన తండ్రే హత్య చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ రాజశేఖర్ రెడ్డి కథనం ప్రకారం.. మేడ్చల్‌లోని సూర్యనగర్‌లో నివాసముండే తిరునగర్ నవ్యశ్రీ(33)కు 15 ఏండ్ల కిందట సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికి బొల్లారంకు చెందిన నరేందర్(35)తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శివరాత్రి రోజు (ఫిబ్రవరి 18న) నవ్యశ్రీ శరీరం కాలిపోతుండగా అరుస్తూ ఇంటినుంచి బయటకు వచ్చింది. గుర్తించిన ఇంటిపక్కన ఉండే వారు, ఆమె భర్త నీటితో మంటలను ఆర్పారు. వెంటనే ములుగులోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ నవ్యశ్రీ వాగ్మూలం ఇస్తూ శివరాత్రి రోజున ఉపవాసం ముగిసిన అనంతరం దేవుడి పటం వద్ద దీపం వెలిగించిన అనంతరం కింద పడవేసిన అగ్గిపుల్ల చీరకు తగిలి, ఒంటికి నిప్పంటుకుందని చెప్పింది. అదే ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం సికింద్రాబాద్ గాంధీ దవాఖానకు తరలించారు. నవ్యశ్రీ గాంధీలో చికిత్సపొందుతూ సోమవారం మృతి చెందింది.
తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు
అయితే నవ్యశ్రీ మృతి చెందిన అనంతరం ఆమె పెద్ద కూతురు పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి, తన తండ్రి నరేందర్‌పై ఫిర్యాదు చేసింది. తన తల్లికి ప్రమాదవశాత్తు నిప్పంటుకోలేదని, తండ్రి ఉద్దేశపూర్వకంగానే శానిటైజర్ చల్లి, నిప్పంటించాడని తెలిపింది. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న తాను అడ్డు పడినా వినకుండా తనపై కూడా శానిటైజర్ చల్లాడని చెప్పింది. ఇందుకు స్పందించిన పోలీసులు నిందితుడు నరేందర్‌పై 302, 201, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

