దసరా వచ్చింది.. ఆఫర్లు తెచ్చింది.. అంబరాన్నంటిన బొనాంజా సంబురాలు – 8వ లక్కీ డ్రా
నగరంలో నమస్తే తెలంగాణ..తెలంగాణ టుడే దినపత్రికల ఆధ్వర్యంలో ప్రతి ఏడాది దసరా నవరాత్రి ఉత్సవాల పండుగ సందర్భంగా అందిస్తున్న దసరా బొనాంజా స్కీంకు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. పది వసంతాలు పూర్తిచేసుకున్న ఈ దసరా బొనాంజా ఆఫర్లకు ఈ ఏడాది చెన్నై షాపింగ్ మాల్ టైటిల్ స్పాన్సర్‌గా..
జూబ్లీహిల్స్, అక్టోబర్14 : నగరంలో నమస్తే తెలంగాణ..తెలంగాణ టుడే దినపత్రికల ఆధ్వర్యంలో ప్రతి ఏడాది దసరా నవరాత్రి ఉత్సవాల పండుగ సందర్భంగా అందిస్తున్న దసరా బొనాంజా స్కీంకు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. పది వసంతాలు పూర్తిచేసుకున్న ఈ దసరా బొనాంజా ఆఫర్లకు ఈ ఏడాది చెన్నై షాపింగ్ మాల్ టైటిల్ స్పాన్సర్‌గా.. టీ న్యూస్, సుమన్ టీవీ మీడియా పార్ట్నర్లుగా, సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించాయి. బిగ్‌సీ, వెన్‌కాబ్, కున్ హ్యుందాయ్, హర్ష టయోటా, చందన బ్రదర్స్, భారతీ సిమెంట్స్, వైశ్యరాజు జ్యువెలర్స్, బ్యాంక్ ఆఫ్ బరోడాల సౌజన్యంతో దసరా సంబురాలు అంబరాన్నంటేలా ఆఫర్లు అందించారు. ఈ నెల 6 నుంచి 14 వరకు నిర్వహించిన దసరా బొనాంజాలో వినియోగదారులు ఆకర్శణీయమైన బహుమతులు అందుకున్నారు. గత పది సంవత్సరాలుగా ఎంపికచేసిన ఈ ఔట్లెట్లలో షాపింగ్ చేసిన వినియోగదారులకు లక్కీ డ్రా కూపన్స్ ఇవ్వడంతో పాటు ఆయా కొనుగోలుదారులకు దసరా ఆఫర్లు అందించడంతో ఆయా వ్యాపార సముదాయాలలో దసరా కొనుగోళ్లతో సందడి నెలకొంది. ఇందులో ప్రతిరోజూ ప్రథమ బహుమతిగా 32 ఇంచెస్ టీవీ, ద్వితీయ బహుమతిగా స్మార్ట్ మొబైల్, తృతీయ బహుమతిగా గిఫ్ట్ ఓచర్, నాల్గవ బహుమతిగా గిఫ్ట్ హ్యాంపర్ అందజేశారు.
షేక్‌పేట్ కున్ హ్యుందాయ్‌లో..
బుధవారం షేక్‌పేట్ కున్ హ్యుందాయ్‌లో.. కున్ యునైటెడ్ హ్యుందాయ్ జనరల్ మేనేజర్ ఆకుల కార్తీక్, ఆదిత్య కమ్యూనికేషన్స్ అధినేత డి.సుకుమార్, అమరావతి కమ్యునికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ వీ హరీష్ బాబు లక్కీడ్రా ద్వారా విజేతలను ప్రకటించారు. సీఎంఆర్ షాపింగ్ మాల్లో కొనుగోలు చేసిన వినియోగదారురాలు సుస్మిత కూపన్ నెంబర్ 013133, చెన్నై షాపింగ్ మాల్లో కొనుగోలు చేసిన వినియోగదారురాలు లత.. కూపన్ నెంబర్ 001113 ప్రథమ, ద్వితీయ బహుమతులు సొంతం చేసుకోగా.. కిరణ్ కుమార్, ఎన్.సురేష్ గిఫ్ట్ ఓచర్, గిఫ్ట్ హ్యాంపర్లు గెల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేల అడ్వడైజింగ్ జీఎం సురేందర్ రావు, అకౌంట్స్ మేనేజర్ వీఎల్. స్వామి, అడ్వడైజింగ్ ఎజీఎం రాజిరెడ్డి, అడ్వైర్టెజింగ్ మేనేజర్ సందీప్ జోషి, అడ్వడైజింగ్ డీజీఎం విజయ్ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.
బొనాంజాతో మధురమైన అనుభూతి
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దసరా షాపింగ్ ఫెస్టివల్లో వినియోగదారులకు దసరా ఆఫర్లతో పాటు ఆకర్షణీయమైన లక్కీ డ్రా బహుమతులు అందిస్తున్నాము. ఈ దసరా బొనాంజాలో గత పదేండ్లుగా పాల్గొంటూ వినియోగదారులకు పండుగకు మధురమైన అనుభూతిని అందిస్తున్నాము. లక్కీ డ్రా పట్ల షాపింగ్‌కు వచ్చే కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు.
-కార్తీక్, జీఎం, కున్ యునైటెడ్ హ్యుందాయ్
ఆదరణ పెరుగుతోంది
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే గత పదేండ్లుగా దసరా షాపింగ్ ఫెస్టివల్లో వినియోగదారులకు దసరా బొనాంజా అందించడం అభినందనీయం. ఆయా మాల్స్‌లో ఆఫర్లతో పాటు లక్కీ డ్రా అందిస్తుండటంతో కొనుగోళ్లు పెరుగుతున్నాయి. వినియోగదారుల ఆదరణ కూడా పెరుగుతోంది.
– డి.సుకుమార్, ఆదిత్య కమ్యునికేషన్స్ అధినేత
పండుగ సంతోషం రెట్టింపు
పండుగకు బహుమతి అందజేయడం ఒక మధురానుభూతి. తెలుగు, ఆంగ్ల పాఠకులను అలరిస్తున్న నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దిన పత్రికలు వార్తలతో పాటు పండుగ సందర్భంగా ప్రతిరోజూ బహుమతులు గెల్చుకున్న విజేతలను ప్రకటిస్తూ పాఠకులకు మరింత చేరువకావడం హర్షనీయం. ఇది వినియోగదారుల్లో పండుగ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది.
– హరీష్ బాబు, ఎండీ, అమరావతి కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

