హైదరాబాద్ : క్యులినరీ ఆర్ట్స్‌లో పీజీ డిప్లమా విద్యార్ధులు తుది పరీక్షల్లో ఇచ్చిన టాస్క్‌లో భాగంగా పది అడుగుల బతుకమ్మ శిల్పాన్ని రూపొందించి ప్రశంసలు అందుకున్నారు. ఎనిమిది బ్లాక్‌ల సాలిడ్ ఐస్‌తో క్యులినరీ అకాడమీ ఆఫ్ ఇండియాలో బతుకమ్మ శిల్పాన్ని విద్యార్ధులు ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంది.
అత్యాధునిక ఎలక్ట్రికల్ ఐరోపా కార్వింగ్ టూల్స్‌ను వాడుతూ వారు పది అడుగుల బతుకమ్మ ఐస్ శిల్పాన్ని తయారుచేశారు. విద్యార్ధులు శ్రమకోర్చి 400 కిలోల బరువున్న పది అడుగుల లైఫ్ సైజ్ బతుకమ్మ శిల్పాన్ని పీఠంపై ప్రతిష్టించారు. బతుకమ్మను బంతిపూలు, చామంతి పూలు, గుమ్మడి పూలతో విద్యార్ధులు అలంకరించిన తీరు ఆకట్టుకుంది.