ట్యాంకర్ ఢీకొని నౌక బోల్తా
అమెరికాలోని మిసిసిపీ నదిపై ప్రమాదం చోటుచేసుకుంది. న్యూ ఓర్లియన్స్ పోర్ట్ వద్ద నిలిపి ఉంచిన క్రూయిజ్ నౌకను శుక్రవారం ఒక ట్యాంకర్ ఢీకొట్టడంతో అది నదిలోకి ఒకవైపునకు ఒరిగి బోల్తాపడింది.
- ప్రాణభయంతో నదిలోకి దూకిన ప్రయాణికులు
న్యూఢిల్లీ, నవంబర్ 14: అమెరికాలోని మిసిసిపీ నదిపై ప్రమాదం చోటుచేసుకుంది. న్యూ ఓర్లియన్స్ పోర్ట్ వద్ద నిలిపి ఉంచిన క్రూయిజ్ నౌకను శుక్రవారం ఒక ట్యాంకర్ ఢీకొట్టడంతో అది నదిలోకి ఒకవైపునకు ఒరిగి బోల్తాపడింది. ప్రాణభయంతో ప్రయాణికులు నదిలోకి దూకారు. ఇతర నౌకల ఆపరేటర్లు, పోర్టు సిబ్బంది ప్రయాణికులను, సిబ్బందిని రక్షించారు.
గాయపడ్డ 32 మందిని దవాఖానకు తరలించినట్టు న్యూ ఓర్లియన్స్ మేయర్ హెలెనా మొరెనో తెలిపారు. ఘటన జరిగిన సమయంలో ఐదంతస్తుల హెరిటేజ్ క్రూయిజ్ నౌకలో ప్రయాణికులు, సిబ్బందితో కలిపి దాదాపు 180 మంది ఉన్నారు. ఢీకొట్టిన ట్యాంకర్ను అట్లాంటిక్ ఆస్ఫాల్ట్గా గుర్తించారు. దవాఖానకు తరలించిన వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని మొరెనో చెప్పారు. ట్యాంకర్ నియంత్రణ కోల్పోవడం వల్లే క్రూయిజ్ నౌకను ఢీకొట్టిందని ఆయన తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

