హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి.. అండాలు సేకరించి..
అండాల దానం పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న సద్గురు హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అనుబంధంగా ఉన్న గడ్డిఅన్నారంలోని ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్‌పై మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు.
- ‘ఒయాసిస్ ఫెర్టిలిటీ’ మేనేజర్ల అరెస్టు
మలక్‌పేట/బంజారాహిల్స్: అండాల దానం పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న సద్గురు హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అనుబంధంగా ఉన్న గడ్డిఅన్నారంలోని ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్‌పై మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. సెంటర్ మేనేజర్ పసల ఆనంద్‌రాజ్(36), అడ్మిన్ ఎగ్జిక్యూటివ్ షేక్ సుభానీ(41)లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బేగంపేట కేంద్రంగా పశ్చిమ బెంగాల్, యూపీ, బీహార్, ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర రాష్ర్టాలకు చెందిన 12 మంది మహిళలను ఏజెంట్ల ద్వారా నగరానికి రప్పించారు. బేగంపేటలోని ‘అమీ నీతా బాలికల హాస్టల్’లో ఉంచి ఎలాంటి వైద్య పరీక్షలు లేకుండానే వారికి హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి.. గడ్డిఅన్నారంలోని బ్రాంచ్ ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్లో అండాలను సేకరిస్తున్నట్లు విచారణలో తేలింది.
ఈ క్రమంలో మలక్‌పేట ఇన్స్పెక్టర్ కుందూరు వెంకట్‌రెడ్డి ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ మేనేజర్ పసల ఆనంద్‌రాజ్(36), అడ్మిన్ ఎగ్జిక్యూటివ్ షేక్ సుభానీ(41)లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సెంటర్ డైరెక్టర్ డాక్టర్ దుర్గారావు, ఏజెంట్లు అమిత్ శర్మ, నిఖత్ పర్వీన్, దీపిక పరారీలో ఉన్నట్లు ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపారు. అలాగే బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ మేనేజర్ నాగేశ్వర్రావు(41)ను శనివారం జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆర్థికంగా వెనకబడిన యువతులకు డబ్బులు ఆశజూపి వారివద్ద నుంచి అండాలు సేకరిస్తున్న వ్యవహారంపై నగరవ్యాప్తంగా జిల్లా వైద్యశాఖ అధికారులు జరిపిన తనిఖీల్లో భాగంగా జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్లో సైతం అండాల సేకరణ జరిగిందని తేలింది. ఈ వ్యవహారంలో సంస్థ నిర్వాహకురాలు డా.దుర్గ సహా పలువురిపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంస్థ మేనేజర్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

