Kedar Jadhav : టీమిండియా మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ (Kedar Jadhav) తండ్రి ఈరోజు అదృశ్యమయ్యాడు. పూనేలో ఉంటున్న జాదవ్ తండ్రి (Mahadev Jadhav) మహదేవ్ జాదవ్ (75) సోమవారం ఉదయం నుంచి కనిపించడం లేదు. దాంతో, ఈ క్రికెటర్ అక్కడి అలంకార్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. అంతేకాదు ఇన్‌స్టాగ్రామ్‌లో తండ్రి ఫొటోను పెట్టి, ఆచూకీ తెలపాలని కోరాడు.
సోమవారం ఉదయం మార్నింగ్ వాక్కు వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి రాలేదని జాదవ్ తెలిపాడు. చుట్టుపక్కల అంతా వెతికిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పాడు. తన ఫాదర్‌కు డిమెన్షియా(Dementia)తో బాధపడుతున్నాడని, ఆయన కొథ్రుడ్ ప్రాంతంలో తప్పిపోయారని జాదవ్ పోలీసులకు వివరించాడు.
మహారాష్ట్రకు చెందిన కేదార్ జాదవ్ ఆల్‌రౌండర్‌గా భారత జట్టులో చోటు సంపాదించాడు. అయితే.. అవకాశాలు ఇచ్చినా కూడా వరుసగా విఫలమవుతూ జట్టులో స్థానం కోల్పోయాడు. జాదవ్ ఐపీఎల్(IPL)లో పలు జట్లకు ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, కొచ్చి టస్కర్స్ ఫ్రాంఛైజీలకు ప్రాతినిధ్యం వహించాడు.