Parineeti-Raghav Chadha | ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. క్రికెట్, మ్యూజికల్ ఛైర్, లెమన్ స్పూన్ ఇంకా ఎన్నో..
Parineeti-Raghav Chadha | బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) వివాహం ఇటీవలే అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలను పరిణీతి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం అవి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా, తాజాగా ప్రీ వెడ్డింగ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను కొత్త జంట ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది.
Parineeti-Raghav Chadha | బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) వివాహం ఇటీవలే అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్ ఉదయ్‌పూర్ (Udaipur)లోని లీలా ప్యాలెస్ (Leela Palace)లో పంజాబీ సంప్రదాయంలో వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలను పరిణీతి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం అవి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా, తాజాగా ప్రీ వెడ్డింగ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను కొత్త జంట ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది.
ప్రీ వెడ్డింగ్ వేడుకలో భాగంగా చోప్రా, చద్దా కుటుంబాలు ఎంతో సరదాగా గడిపాయి. అంతా కలిసి సరదాగా కొన్ని ఆటలు ఆడుకున్నారు. క్రికెట్ (Cricket), లెమన్ స్పూన్ (lemon & spoon), మ్యూజికల్ ఛైర్, త్రీ లెగ్గుడ్ రేస్ (three-legged race) తదితర ఆటలు ఆడారు. ఇందులో ఇరు కుటుంబ సభ్యులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
రాఘవ్-పరిణీతి వివాహం ఈనెల 24వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది. బంధుమిత్రులు, స్నేహితుల సమక్ష్యంలో రాఘవ్ తన ప్రేయసి పరిణీతి మెడలో మూడుముళ్లు వేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం సహా పలువురు రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన పెళ్లి ఫొటోలు, వీడియోలను కొత్త జంట సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Also Read..
Jithender Reddy | జితేందర్‌రెడ్డిగా బాహుబలి యాక్టర్ రాకేశ్.. స్టైలిష్ లుక్ అదిరింది
Hrithik Roshan | ప్రియురాలి నటనకి మురిసిపోతున్న స్టార్ హీరో
Megastar Chiranjeevi | మెగాస్టార్ సినిమాపై మెగా రూమర్.. నిజమేనా ??
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

