హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): పాలనలో అనుభవరాహిత్యం, సమన్వయలోపం కారణంగానే రాష్ట్రంలో ఆనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ అధికారమం తా తన గుప్పిట పెట్టుకున్నట్టు కనిపిస్తున్నదని, శాఖల వారీగా వికేంద్రీకరణ జరుగాలని సూచించారు. మంత్రులకు ఎలాంటి అధికారాలు ఉన్నట్టు కనిపించడం లేదని, వారికి తమ శాఖలపై పూర్తి స్వేచ్ఛ లేకపోవడం వల్ల అభివృద్ధి పనులకు అడ్డంకులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రజావ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ ‘బద్లావ్ జరూరీ హై’ నినాదంతో మంగళవారం ఢిల్లీలో భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్టు తెలిపారు.