మల్కాజ్గిరి సీసీఎస్ ఎస్ఐపై అత్యాచారం కేసు.. సస్పెండ్ చేసిన సీపీ
CCS SI Vijay | మల్కాజ్గిరి సీసీఎస్ ఎస్ఐ ధరావత్ విజయ్‌పై రేప్ కేసు నమోదైంది. పెండ్లి పేరుతో తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్: నగరంలోని మల్కాజ్గిరి సీసీఎస్ ఎస్ఐ ధరావత్ విజయ్‌పై రేప్ కేసు నమోదైంది. పెండ్లి పేరుతో తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనతో కొంతకాలం సహజీవనం చేసి, ప్రస్తుతం పెళ్లికి నిరాకరిస్తున్నాడని అందులో పేర్కొన్నది. తనను వేరే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడని తెలిపింది.
ఇంతకు ముందే పెండ్లయిన విషయాన్ని దాచిపెట్టాడని, కొంతకాలంపాటు హైదరాబాద్‌లో ఇద్దరం కలిసే ఉన్నామని వెల్లడించింది. యువతి ఫిర్యాదుతో ఎస్ఐ విజయ్ను రాచకొండ సీపీ మహేష్‌భగవత్ సస్పెండ్ చేశారు. కేసుపై పూర్తి విచారణ జరపాలని ఆదేశించారు. కాగా, గతంలో వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనూ విజయ్ సస్పెన్షన్‌కు గురయ్యారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

