GSLV-F10 : జీఎస్ఎల్వీ రాకెట్ కౌంట్‌డౌన్ ప్రారంభం
GSLV-F10 : జీఎస్ఎల్వీ రాకెట్ కౌంట్‌డౌన్ ప్రారంభం | నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో జీఎల్ఎల్వీ రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 3.43 గంటలకు ఇస్రో శాస్త్రవేత్తలు కౌంట్‌డౌన్ ప్రారంభించగా.. గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎల్ఎల్వీ-ఎఫ్10 రాకెట్

హైదరాబాద్ : నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో జీఎల్ఎల్వీ రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 3.43 గంటలకు ఇస్రో శాస్త్రవేత్తలు కౌంట్‌డౌన్ ప్రారంభించగా.. గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎల్ఎల్వీ-ఎఫ్10 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. రాకెట్ ద్వారా 2,268 కిలోల బరువున్న జీఐశాట్-1 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు.
ఈ ఉపగ్రహం ద్వారా దేశ రక్షణ వ్యవస్థకు, విపత్తుల నిర్వహణకు ఉపకరించే భూపరిశీలన అంశాలను తెలుసుకునే వీలుంది. మంగళవారం ఇస్రో చైర్మన్ శివన్ నేతృత్వంలో షార్‌లో మిషన్ సంసిద్ధత సమావేశం జరిగింది. దశల వారీగా రాకెట్ అనుసంధానంపై సమీక్షించారు. సాయంత్రం 5 గంటల నుంచి జరిగిన లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) సమావేశంలో ప్రయోగానికి అధికారికంగా అనుమతి ఇచ్చారు.
అనంతరం ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు(ల్యాబ్)కు అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు మధ్యాహ్నం మరోసారి సమావేశమై కౌంట్‌డౌన్, ప్రయోగంపై చర్చించారు. ఈ క్రమంలో ఉదయం కౌంట్‌డౌన్ ప్రారంభం కాగా.. 26 గంటల పాటు కౌంట్‌డౌన్ కొనసాగిన అనంతరం గురువారం ఉదయం జీఎస్ఎల్వీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
ఇవి కూడా చదవండి..
పిల్లలకు పాలుపట్టే ‘సీసా’లో భూతం.. జాగ్రత్త!
మనోవ్యాధి ‘సైబర్‌కాండ్రియా’
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

