మనోవ్యాధి ‘సైబర్‌కాండ్రియా’

తరచూ ఇంటర్నెట్లో ఆరోగ్య సమాచారం కోసం వెతుకుతున్నారా? వెబ్ సైట్స్, యూ ట్యూబ్ చూసి తెలిసీతెలియని వైద్యం చేసుకొంటున్నారా? అయితే మీరు సైబర్‌కాండ్రియా బాధితులే. గుండెపైనే కాదు, మానసిక స్థితి మీదా సైబర్‌కాండ్రియా తీవ్ర ప్రభావం చూపుతుందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్‌కు చెందిన స్వాతి పెండ్లయిన ఐదేండ్ల తర్వాత గర్భం దాల్చింది. అప్పటి నుంచీ ‘ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలా తినాలి? ఇంకేం చేయాలి?’.. ఇలా ప్రతి విషయాన్నీ ఇంటర్నెట్లో చూసి తెలుసుకొనేది. ఏ అనుమానం వచ్చినా వెబ్ సైట్స్‌ను, యూ ట్యూబ్‌ను ఆశ్రయించేది. ఆ కథనాలన్నీ చూశాక గర్భంలోని శిశువు ఎదుగుదల గురించి ఆమెలో ఆందోళన మొదలైంది. చివరికి అదో వ్యసనంగా మారింది. ఆమెకు సైబర్‌కాండ్రియా అనే మనోవ్యాధి ఉన్నట్లు గుర్తించారు.
వైద్యుల సూచన మేరకు నెట్‌కు, ఫోన్‌కు స్వాతిని దూరంగా ఉంచడంతో ఆరోగ్యం కొంత కుదుటపడింది. 15 నుంచి 80 ఏండ్ల వారి వరకూ ఎవరైనా ఈ వ్యాధి బారిన పడవచ్చు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సంబంధిత వైద్యుడి దగ్గరకు వెళ్తే, స్వస్థత లభిస్తుంది. అంతేకానీ, ఇంటర్నెట్లో పరిష్కారాలు వెతికి, కొత్త వ్యాధుల బారిన పడొద్దని హెచ్చరిస్తున్నారు మానసిక వైద్యులు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Cyberchondria
- Psychiatric
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

